CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే నేను కూడా సమయం కేటాయిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం రేంవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వున్న ప్రజలందరికి పాలణ పరమైన ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం సీరియస్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం అని అన్నారు. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం అని రేవంత్ రెడ్డి అన్నారు.
దేశానికే మనం ఆదర్శం: రేవంత్ రెడ్డి
భూ భారతిని రైతులకు చేరవేయాలి దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామని, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.
Also Read: TG on SDRF: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏకంగా రూ. 4 లక్షల సాయం అందించేందుకు రెడీ..
రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని అన్నారు. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసిందని అన్నారు. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది అని అన్నారు. మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు.
మోదీకి గుదిబండగా మారిణ కులగణన:
రాష్ట్రంలో మనం మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన అన్నారు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరి అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి సన్న బియ్యం మన పథకం మన పేటెంట్, మన బ్రాండ్ అని రేవంత్ రెవంత్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యేల తీరు పై సీఎం సీరియస్:
ఎమ్మెల్యేల తీరు పై సీఎం సీరియస్ అయ్యారు. పర్ఫార్మెన్స్ రిపోర్ట్ తో రావాలని ఆదేశించిన సీఎం అదేశించారు. సంవత్సరం పొడవునా చేసిన పార్టీ ఆక్టివిటీస్ రిపోర్ట్ తో వచ్చిన ఎమ్మెల్యేలు. మరింత స్పీడ్ గా పర్ఫార్మెన్స్ ఉండాలని స్ట్రిక్ట్ వార్ణినింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పదవులు రావని అలా మాట్లాడితే ఇక్కడ పదవులు వస్తాయి అనుకుంటే మీకే నష్టం. పదవులు ఇచ్చేది అధిష్టానం అధిష్టానం ఫైనల్ ఇష్టా రీతిలో మాట్లాడితే ఎక్కువ నష్టం మీకేఅని, పార్టీ లైన్ దాటి ఎవరు కామెంట్స్ చెయ్యొద్దని రేవంత్ రెడ్డి సీరియస్ వార్ణింగ్ ఇచ్చాడు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/