మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad district: దేశంలోనీ ఆకాంక్షిత (ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం) మండలాల డెల్టా ర్యాంకింగ్సలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రెండవ స్థానంలో నిలిచింది. తాజాగా నీతి అయోగ్ ర్యాంకింగ్ లో మహబూబాబాద్ జిల్లా గంగారం బ్లాక్ (మొదటి స్థానం) ర్యాంకింగ్లో సాధించిందని, సామాజిక ఫలితాలు అభివృద్ధి ని పెంపొందించడంలో, జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో కలిసి కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో హెల్త్ అండ్ న్యూట్రీషియన్, విద్య, సామాజిక అభివృద్ధి.
మౌలిక వసతుల కల్పన వ్యవసాయ, వ్యవసాయేతర అభివృద్ధి, ఐదు (థీమ్స్),లతో (40) సూచికల ద్వారా లోపాలను గుర్తించి మెరుగుపరచడానికి అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పనిచేయడం వలన ఈ విజయం సాధ్యమయిందని శ్రీనాథ్ పాలకే ఆన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో శ్రేష్టత కోసం ప్రయత్నించడం, కొనసాగించడానికి అందరికీ ప్రేరణగా ఉంటుందని, భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలు సాధించడానికి అందరి సహకారంతో సాధ్యం అయ్యిందని శ్రీనాథ్ తెలిపారు.
Also Read: Gold Rate Today : బంగారం ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్!
రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రకటించిన డిసెంబర్ 3వ త్రైమాసిక ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ABP) డెల్టా ర్యాంకింగ్స్‌లో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని గంగారం బ్లాక్ అగ్రస్థానంలో నిలవడం భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందని బ్లాక్‌లలో పాలనను మెరుగుపరచడం, జీవన నాణ్యతను పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం ఆన్నారు. ర్యాంకింగ్ బ్లాక్‌ల పనితీరు, సూచికల పై పురోగతిపై ఆధారపడి ఉంటుందని, పోటీతత్వం, సహకార సమాఖ్య వాదాన్ని ప్రోత్సహించే ఏబీపీలో ర్యాంకింగ్ కీలకమైన భాగం అన్నారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రెండవ స్థానం ర్యాంకింగ్లో సాధించిందని, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా సంబంధిత అధికారులు మరింత ఉత్సాహంతో, క్షేత్రస్థాయిలో పనిచేసి అభివృద్ధి చేయుటకు కృషి చేయాలని ఆమె మంత్రి సీతక్క కోరారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/