Domestic Violence Survey: దాంపత్య జీవితం అనేక రకాల ఎమోషన్స్ తో ముడిపడి ఉంటుంది. కష్టం, సుఖం, బాధ, ఆనందం, ఆశ్చర్యం ఇలా అన్నీ భార్య భర్తల బంధంలో మిళితమై ఉంటాయి. అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో భార్య భర్తల మధ్య విభేదాలు (Domestic Violence Survey) ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ సంస్థ నిర్వహించిన సర్వే నెట్టింట వైరల్ అవుతోంది. గొడవ జరిగినప్పుడు భర్తను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు భార్యలు ఇచ్చిన ఆన్సర్ చేసి అంతా నివ్వెరపోతున్నారు. ఇంతకీ ఆ సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వారి ఆన్సర్ ఏంటంటే!
భర్తతో గొడవ జరిగినప్పుడు చాలా మంది స్త్రీలు వెంటనే కన్నీటి పర్యంతం అవుతుంటారు. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. తద్వారా ఆ కోపాన్ని తగ్గించుకునేందుకు యత్నిస్తారు. అయితే కోపం వచ్చినప్పుడు మీ మైండ్ లో ఏం రన్ అవుతుందన్న ప్రశ్నకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు దాదాపు ఒకటే ఆన్సర్ ఇచ్చారు. భర్త గూబ చెల్లుమని అనిపించాలని ఉంటుందని షాకింగ్ సమాధానం ఇచ్చారు. తద్వారా తమ కోపాన్ని వారిపై తీర్చుకోవాలని భావిస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు.
అందరి నోటా ఒకటే
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దీనిపై సర్వే జరపగా.. భర్తను కొట్టడం తప్పని కనీసం ఒక్క రాష్ట్రంలోనూ సమాధానం రాలేదని సదరు సర్వే తెలిపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది స్త్రీలు గొడవ జరిగిన సందర్భంలో భర్తను కొట్టడంలో ఏమాత్రం తప్పులేదని సమాధానం ఇచ్చారట. ఇందుకు అనుకూలంగా ఏపీలో 33.9%, తెలంగాణలో 29.3% మంది సమాధానం ఇచ్చినట్లు తేలింది. దీన్ని బట్టి చూస్తే గొడవ జరిగినప్పుడు భార్య ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో..
ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలో ఏకంగా 36.1% మంది మహిళలు.. భర్తను కొట్టడంలో తప్పే లేదని సమాధానం ఇచ్చారు. అలాగే తమిళనాడులో 33.6% మంది స్త్రీలు భర్తకు వ్యతిరేకంగా సమాధానం ఇచ్చారు. నార్త్ కు వెళ్తే రాజస్థాన్ లో 17.6%, యూపీలో 23.1%, బిహార్ లో 21.3%, పంజాబ్ లో 25.6%, మహారాష్ట్రలో 19.3% మంది స్త్రీలు భర్తను భర్తను కొట్టాలని అనిపిస్తుందని చెప్పారు. అయితే సర్వేలో పాల్గొన్నవారు ప్రస్తుత జనరేషన్ స్త్రీలు అయ్యి ఉండొచ్చని.. స్వతంత్ర భావాలను కలిగి ఉన్న నేపథ్యంలో ఈ విధమైన ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.
Also Read: Pawan Kalyan: తిరుమలకు పవన్.. ఆ విమర్శలకు చెక్.. ట్రోలర్స్ కు నిద్ర లేనట్లే!
మ్యాప్ వైరల్!
ప్రస్తుతం ఈ సర్వేకు సంబంధించిన సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిని ఏ సంస్థ నిర్వహించింది? ఎప్పుడు చేపట్టింది? ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సర్వేపై పలువురు స్త్రీలు స్పందిస్తున్నారు. గొడవలో భర్తది తప్పు ఉంటే కచ్చితంగా తిరగబడతామని అంటున్నారు. అందులో తప్పేం ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ సర్వే చెప్పింది నిజమేనని పురుషులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.