Damodar Raja Narasimha: నిలోఫర్ ఆసుపత్రిలో మిషన్ల కొనుగోలు అవకతవకల ఆరోపణలపై హెల్త్ మినిస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే ఎంక్వైయిరీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. డీఎంఈ ఆధ్వర్యంలో విచారణ జరగనున్నది. అయితే మిషన్ల కొనుగోల్లలో ఎస్టిమేషన్స్ పెంచారంటూ వచ్చిన వార్తలు నిజం కాదని ప్రభుత్వానికి వివరించేందుకు సూపరింటెండెంట్ మళ్లీ సంతకాలు ఒత్తిడి చేసినట్లు సమాచారం.
ఎలాంటి తప్పిదాలు జరగలేదంటూ ఆర్ ఎంవోలపై ప్రెజర్ పెట్టి మళ్లీ సంతకాలు సేకరించినట్లు తెలిసింది. ఇదే విషయం ప్రభుత్వానికి కూడా చేరింది. ఏం చేసినా ఎంక్వైయిరీ లో అన్నీ తేలుతాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే గతంలో బ్లడ్ బ్యాంక్ లో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బ్లడ్ బ్యాంక్ లో తప్పిదాలు జరిగాయని డీఎంఈ కమిటీ, ఆర్ ఎంవోల కమిటీ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది.
Also read: Vishwambhara: ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ ‘రామా రామా’ స్పెషల్ ఏంటో తెలుసా?
కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు కూడా ఎంక్వైయిరీ కమిటీ వేశారు. కానీ రిపోర్టుల్లో తప్పిదాలు తేలినా, యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిలోఫర్ ఆసుపత్రి అస్తవ్యస్తంగా మారుతుందని స్వయంగా అందులో పనిచేసే డాక్టర్లే చెప్తున్నారు. ఒక్కరి నిర్లక్ష్యంతో సర్కారీ దవాఖానకు చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.