Hanuman Jayanti 2025 (image credit:Twitter)
హైదరాబాద్

Hanuman Jayanti 2025: హైదరాబాద్ కాషాయమయం.. ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర..

Hanuman Jayanti 2025: హైదరాబాద్ నగరం కాషాయమయమైంది. ఎటు చూసినా జై హనుమాన్ నామం ధ్వనించింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు. జైశ్రీరామ్.. జై జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ, జై హనుమాన్ అంటూ మరికొందరు భక్తులు పవిత్ర నినాదాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సాగుతున్న హనుమాన్ శోభాయాత్ర వద్ద ఈ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీ. హిందూ సోదరులందరూ జై హనుమాన్ అంటూ నినదిస్తూ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటారు. గౌలిగూడ రామ్ మందిర్ నుండి హనుమాన్ శోభాయాత్ర శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు.

శోభాయాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. అంతేకాదు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంతో వాహన దారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించడంతో వాహనదారులు ఆంక్షలు ఉన్న రహదారుల వైపు రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి 8 గంటల వరకు సాగనుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుండి తాడ్ బండ్ హనుమాన్ మందిరం వరకు హనుమాన్ శోభాయాత్ర సాగుతుండగా దారి పొడవునా భక్తులు జై హనుమాన్ అంటూ నినదిస్తున్నారు. 450 సీసీ కెమెరాలు, వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రతా చర్యలను పోలీసులు చేపట్టారు.

హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లోని సలాసర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, తీర్థ ప్రసాదాలు అందజేసి, స్వామి వారి ఆశీర్వాదములు అందించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు భక్తులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.

Also Read: EDCIL Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వెంటనే,ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి!

హిందువులు ఏకం కావాలి
హిందువులు అందరూ ఏకం కావాలని భజరంగ్ దళ రాష్ట్ర అధ్యక్షులు శివరాములు అన్నారు. ఈ వీర హనుమాన్ శోభా యాత్ర 20 ఇల్లు పూర్తి చేసుకొని, 21 వ వసంతం లోకి అడుగు పెడుతున్నట్లు తెలిపారు. హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి.. హిందువుల జనాభా తగ్గిపోతుంది, మళ్ళీ మనం జనాభా పెరగాలన్నారు. మనం తక్కువ కాకూడదు.. మన దేశం మరో పాకిస్తాన్,బంగ్లాదేశ్ గా మారొద్దన్నారు. పాకిస్తాన్ కోసం ఈ దేశం లో ఉండి పని చేస్తున్న వారిని తరిమికొట్టాలని శోభాయాత్రలో ఆయన ప్రసంగించారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?