AP Inter Results: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు (Andhra Pradesh Intermediate Results 2025) విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్ (Inter First Year), సెకండ్ ఇయర్ (Inter Second Year) పరీక్షల మూల్యంకనాన్ని పూర్తి చేసిన ఇంటర్ బోర్డ్.. తాజాగా వాటి ఫలితాలను విడుదల చేసింది.
రిజల్ట్స్ ను పూర్తిగా కంప్యూటీకరణ చేసి తమ వెబ్ సైట్ లో ఇంటర్మీడియట్ బోర్డ్ (Board of Intermediate Education, Andhra Pradesh) పొందుపరిచించింది. ఫలితాలు కోసం అధికారిక వెబ్ సైట్ ను క్లిక్ చేయండి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినవారు.. తర్వాతి ఏడాది ఎడ్యుకేషన్ కు అర్హత సాధిస్తారు.
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. మార్చి 1- 19 మద్య జరగ్గా.. సెకండియర్ కు మార్చి 3- 20 మధ్య నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లకు కలిపి 10,17,102 మంది (Overal Inter Students) పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న క్రమంలోనే మార్చిన 17 నుంచి.. మూల్యాంకన ప్రక్రియను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రారంభించింది. 25 కేంద్రాల్లో నాలుగు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం ఫలితాలను కంప్యూటీకరణ చేసి భద్రపరిచారు. ఇందుకు అనుగుణంగా తాజాగా ఫలితాలను విడుదల చేశారు.
Also Read: Horror Thriller: అమ్మాయిల హాస్టల్లో దెయ్యాలు, అతీత శక్తులు.. వణుకుపుట్టించే ట్విస్టులతో.. ఎక్కడ చూడొచ్చంటే?
ఇలా చెక్ చేసుకోండి
ఇంటర్ విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను పొందేందుకు https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లో కొన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్/పుట్టిన తేదీ వివరాలను తొలుత ఎంటర్ చేయాలి. అలా చేస్తే సంబంధిత విద్యార్థి మార్కుల లిస్ట్.. పీడీఎఫ్ రూపంలో తెరపై కనిపిస్తాయి. వెంటేనే డౌన్ లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫలితాలను పొందవచ్చు. మీ సేవా కేంద్రాలు, ఇంటర్ నెట్ సెంటర్లలో మీరు ఫలితాలు పొందవచ్చు. లేదంటే సొంతంగానైనా పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
వాట్సప్ లో ఫలితాలు..
పరీక్ష రాసిన ఇంటర్ విద్యార్థులు (Inter Students) వాట్సప్ లోనూ ఫలితాలను పొందవచ్చు. ఏపీ ప్రభుత్వం (AP Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాట్సప్ గవర్నెన్స్ (WhatsApp Governance) ‘మన మిత్ర’ (Mana Mithra)లో తొలిసారి ఇంటర్ రిజల్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పరీక్ష రాసిన విద్యార్థులు 9552300009 మన మిత్ర నెంబర్‌కు Hi అని మెసేజ్ పెట్టి నేరుగా ఫలితాలను పొందొచ్చు. తొలుత Hi మెసేజ్ పెట్టగానే ప్రభుత్వ సేవల ఆప్షన్స్ వస్తుంది. అక్కడ విద్యా సేవలు అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్స్ పొందవచ్చు.
Also Read This: Miss World Contest 2025: అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతున్న మిస్ వరల్డ్ పోటీలు.. మే 14న వరంగల్ టూర్!
పాస్ పర్సంటేజ్ ఇలా..
ఇంటర్ రిజల్ట్స్ ను నారా లోకేష్ స్వయంగా విడుదల చేశారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి మెుత్తం 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ లో 4,87,295 విద్యార్థులకు గాను 3,42,979 మంది (70%) పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో 4,22,030 గాను 3,51,521 మంది (83 %) ఉత్తీర్ణులు అయ్యారు. అటు వొకేషనల్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ లో 38,553 మందికి 23,991 (62 %) మంది సక్సెస్ అయ్యారు. రెండో ఏడాదిలో 33,289 పరీక్షలు రాస్తే 25,707 (77 %) మంది పాస్ అయ్యారు.
మళ్లీ అమ్మాయిలే టాప్
ప్రతీ ఏడాదిలాగే ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఫలితాల్లోనూ అమ్మాయిలే టాప్ లో నిలిచారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ లో అబ్బాయిలపై పై చేయి సాధించారు. ఇంటర్ తొలి ఏడాదిలో 66% అబ్బాయిలు విజయం సాదిస్తే.. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 75%గా నమోదైంది. అలాగే సెకండియర్ లో అమ్మాయిలు 86% మంది పాస్ అవ్వగా.. అబ్బాయిలు 80% మేర పాస్ అయ్యారు. అటు వొకేషనల్ లోనూ అమ్మాయిల హవానే నడిచింది. ఫస్ట్ ఇయర్ లో 71%, సెకండ్ ఇయర్ లో 84% మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు. అదే అబ్బాయిల విషయానికి వస్తే తొలి ఏడాది ఇంటర్ లో 50%, ద్వితియ సంవత్సరంలో 67% పాస్ అయ్యారు.