Flats To Farmers In AP: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపులు జరిగాయి. ఉండవల్లి, పెనుమాక గ్రామ రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించారు. బుధవారం సీఆర్డీఏ కార్యాలయంలో ఈ-లాటరీ విధానం ద్వారా 101 రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు ఇచ్చారు. ఇందులో 59 నివాస ఫ్లాట్లు కాగా, 42 వాణిజ్య ఫ్లాట్లు ఉన్నాయి.
ఈ-లాటరీకి హాజరైన రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. అనంతరం రైతులకు సీఆర్డీఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. ఇదిలా ఉంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల్లో భూముల విక్రయాలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తున్నది.
రావెల పట్టణ పరిధిలోని గ్రామాల్లో చాలా మంది ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎయిర్‌పోర్టుతో పాటు, లాజిస్టిక్ పార్క్ వచ్చే అవకాశం ఉండటంతో రియల్ఎస్టేట్ ఊపందుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడ గజం రేటు రూ.20వేలకు పైగా పెరిగిపోయినట్లు స్థానికంగా, సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది.
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/