Panjagutta police
హైదరాబాద్

Panjagutta police: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వింత కేసు.. నమోదు చేసిన పోలీసులు..

Panjagutta police: పలుమార్లు పోలీసులు వింత కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఫిర్యాదులను చూసి పోలీసులు ఆశ్చర్యపోయినా, చివరకు వారి విధి నిర్వహణలో ఆ కేసులను ఛేదించాల్సిందే. అలాంటి ఫిర్యాదే హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. దీనితో పోలీసులు సైతం కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. ఇంతకు ఏంటా విచిత్రమైన కేసు అనుకుంటున్నారా.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఇటీవల స్పెషల్ క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రిటీలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇలా ఇటీవల వార్తల్లో నిలిచిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు కొన్ని వింత కేసులు కూడా వస్తుంటాయి. గతంలో బూట్ల చోరీ జరిగిందని ఓ వింత కేసు సైతం రాగా పోలీసులు కేసు నమోదు చేశారు. సేమ్ టు సేమ్ అలాంటిదే ఈ కేసు.

విద్యుత్ శాఖ అధికారులు తమ విధి నిర్వహణలో ఎక్కువగా నిచ్చెన ఉపయోగిస్తారు. విద్యుత్ తీగలను తగిలే చెట్లను తొలగించేందుకు, అలాగే విద్యుత్ స్తంభాలను ఎక్కేందుకు, ఇలా ప్రతి పనికి విద్యుత్ శాఖ సిబ్బందికి నిచ్చెన అత్యంత అవసరం. అందుకే వారు విని నిర్వహణలో ఉన్నారంటే చాలు వారి వెంట నిచ్చెన ఉండాల్సిందే. అలాంటి నిచ్చెన చోరీకి గురైంది. తమ వృత్తిలో భాగమైన నిచ్చెన చోరీ కావడంతో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు నివ్వెర పోయారు.

చోరీలలో ఇదో వెరైటీ చోరీ అంటూ.. ఎట్టి పరిస్థితుల్లో దీనిని సహించేది లేదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బాట పట్టారు. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన విద్యుత్ శాఖ అధికారులు నిచ్చెన చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఇంకేముంది పోలీసులు తమ డ్యూటీ కానిచ్చేశారు.

Also Read: Taiwan Earthquake: ఆ ప్రదేశంలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు.. ఎక్కడంటే!

విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిచ్చెన చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం బయటకు తెలియడంతో నిచ్చెన చోరీ చేసిన ఆ ఘనుడు ఎవరో తెలుసుకోవాలని స్థానిక ప్రజలు సైతం ఆరాటపడుతున్నారు. మొత్తం మీద కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న సదరు నిచ్చెన తీసుకెళ్లిన వ్యక్తి, మరలా అందించే అవకాశాలు ఉండవచ్చని మరికొందరు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ నిచ్చెన కేసు ఏమలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?