Police Bid farewell to Dog (imagecredit:swetcha)
ఖమ్మం

Police Bid farewell to Dog: పోలీస్ శాఖకు విశేష సేవలందించిన పోలీసు జాగిలం యామి మృతి…

ఖమ్మం స్వేచ్ఛ: Police Bid farewell to Dog: పోలీస్‌ శాఖలో 9 ఏళ్లుగా పని చేసి పోలీస్ వారికి విశేష సేవలందించిన పోలీసు జాగిలం యామి (ఫిమేల్ డాగ్) అనారోగ్యంతో మృతి చెందడంతో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు పోలీస్ అధికారులు అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

ఖమ్మం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో లబ్రాడార్‌ రిట్రీవర్‌ సంతతికి చెందిన తొమ్మిది ఏళ్ల యామి (జాగిలం) ఉదయం చనిపోగా పోలీస్‌ అధికారు లు,జాగిలం హ్యాండ్లర్‌ సురేష్ తో కలిసి ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఏసిపి నర్సయ్య జాగిలంపై పుష్ఫగుచ్చాలు వేసి నివాళులర్పించారు. వీఐపీలు, వీవీఐపీలు సందర్శించినప్పుడు స్నిపర్‌, బాంబులు, మందుపాత్రలు గుర్తించడంలో జాగిలం యామి చాకచక్యంగా వ్యవహరించదని గుర్తుచేశారు.

2016లో యామి తన హ్యాండ్లర్‌ సురేష్ తో పాటు ఎనిమిది నెలల పాటు ప్రత్యేకంగా ఐఐటీఏ మెయినాబాద్‌లో ట్రెయినింగ్‌ సెంటర్ లో శిక్షణ తీసుకొని జిల్లాకు వచ్చిందని, అప్పటి నుంచి సేవలందించిందని కొనియాడారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు కామరాజు, శ్రీశైలం, సురేష్,అప్పలనాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Drugs Seized India: దేశంపై డ్రగ్స్ పంజా.. కుర్రకారే టార్గెట్.. ఈ కథనంలో అన్నీ ట్విస్టులే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!