Collector Muzammil Khan: మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. [Muzammil Khan]కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వసతులు, వైద్య కళాశాల లో సౌకర్యాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుపర్చుటకు చర్యలు చేపట్టాలన్నారు.
టాయిలెట్ల మరమ్మత్తులు, అవసరమైన క్రొత్త టాయిలెట్ల నిర్మాణంనకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. విభాగాల వారిగా కావాల్సిన సౌకర్యాల నివేదిక ఇవ్వాలన్నారు. ఓపి గదులు చిన్నవిగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉన్నట్లు, సరిపోవు విధంగా ప్రత్యామ్నాయ గదులు చూడాలన్నారు. మరో అంతస్తు, లిఫ్ట్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.రేడియాలజిస్ట్ తదితర కావాల్సిన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పై నియామకానికి చర్యలు తీసుకోవాలని, కావాల్సిన పరికరాలు, టెస్టింగ్ కిట్స్, మందుల జాబితా సమర్పించాలన్నారు. ఎలక్ట్రిషియన్, ప్లంబర్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల వసతులు, మరమ్మతులపై దృష్టి పెట్టాలన్నారు.
Also Read: Mark Shankar: ఆస్పత్రిలో పవన్ తనయుడు.. ఫొటో చూస్తే గుండె తరుక్కుపోతుంది
ఆరోగ్యశ్రీ వార్డ్ ను అభివృద్ధి చేయాలన్నారు.ఆరోగ్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కని, ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించే బాధ్యత మనపై ఉందని కలెక్టర్ [Muzammil Khan] అన్నారు. ప్రతి విభాగాధిపతిని వారి వారి విభాగంలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సౌకర్యాల విషయమై వెంటనే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
వైద్యాధికారులు సేవాదృక్పథంతో ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్[Muzammil Khan] తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. కళావతి బాయి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, ఉప జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. సైదులు, వైద్యాధికారులు, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ షఫీయుల్లా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈhttps://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు