నల్లగొండ స్వేచ్చ: Nalgonda Gas Dealers: గ్యాస్ సిలిండర్ల సరఫరా ఏజెన్సీ సేవలు సంతృప్తికరంగా లేకపోతే డీలర్‌ను మార్చుకునే సౌలభ్యంను వినియోగదారులకు ఉన్నదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఆయన “స్వేచ్ఛ” తో మాట్లాడారు.
కొందరు డీలర్లు గ్యాస్ డెలివరీ బాయ్‌ల అక్రమాలకు అడ్డు వేయక పోవటం వల్ల అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని రఘునందన్ తెలిపారు. అయితే గ్యాస్ ఏజెన్సీల సేవల పట్ల సంతృప్తిగా లేకున్నా డెలివరీలో తీవ్ర జాప్యం ఉన్నా సంతృప్తికరమైన, మెరుగైన సేవల కోసం డీలర్‌ను మార్చుకునే సౌలభ్యం వినియోగదారులకు ఉన్నదని రఘునందన్ వివరించారు.
గ్యాస్ డీలర్ షిప్ అనేది లాభాపేక్షతో కూడిన వ్యాపారం కానేకాదని, సేవా భావంతో కూడిన స్వయం ఉపాధి పథకం అని మాచన రఘునందన్ స్పష్టం చేశారు.
Also Read: Food safety department: కల్తీ ఆహారంపై సర్కార్ సీరియస్.. పుడ్ సేఫ్టీకి కొత్త టార్గెట్స్!