Police SI Arrested: ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుండి పదివేల లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగింది. నల్గొండ ఏసీబీ అధికారి జగదీశ్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం గత అక్టోబర్ 23 వ తారీఖున చింతలపాలెం పోలీస్ స్టేషన్లో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదైనట్టు తెలిపారు.
వీరిలో ఓ వ్యక్తిని ఎస్సై అంతిరెడ్డి పోలీస్ స్టేషన్ కి పిలిపించి స్టేషన్ బెయిల్ ఇస్తానని బేరమాడాడన్నారు. దీంట్లో భాగంగా ఎస్సై రూ.15000 డిమాండ్ చేయగా చివరకు రూ.10000 కు ఒప్పుకున్నాడన్నారు. ఇదే విషయంపై ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించి సమాచారం ఇవ్వగా ఎస్సై పై విచారణ చేశామన్నారు.
ఎస్సైపై గతంలోనూ అవినీతి ఆరోపణ లు ఉన్నాయని తేలిందన్నారు. దీంతో ఎస్ఐ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా మంగళవారం సాయంత్రం ఫిర్యాదు దారుడి నుంచి పదివేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. అతన్ని కస్టడీలోకి తీసుకొని అతని ఇంటిలోనూ, పోలీస్ స్టేషన్లో నూ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Also read: Manchu War: ‘మంచు వార్’ మళ్లీ షురూ.. ఇంటి వద్ద మనోజ్ బైఠాయింపు.. జల్ పల్లిలో హై అలెర్ట్!
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు దారుడి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కావున ఎవరైనా నిర్మొహమాటంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కాగా ఎస్సై అంతిరెడ్డిపై విచారణ కొనసాగుతూనే ఉంది.
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/