Theft At KIA Unit AP: సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమ (KIA)లో భారీ చోరి జరిగినట్లు తెలుస్తోంది. పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయమైనట్లు సమాచారం. గత నెలలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసిందని చెబుతున్నారు. 900 ఇంజిన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి 19న పెనుగొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని యాజమాన్యం కోరగా.. పోలీసులు నిరాకరించినట్లు సమాచారం. ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేపడతామని వారు స్పష్టం చేశారట.
Also Read: Deputy CM Pawan Kalyan: అరకు అందాలు ఆస్వాదించండి.. నాశనం చేయవద్దు.. పవన్ కళ్యాణ్
దీంతో కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై విచారణ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారట. కియా పరిశ్రమకు విడి భాగాలు ఒక్కో చోటు నుంచి వస్తుంటాయి. కారు ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తుండగా మార్గమధ్యంలో చోరీ అయ్యాయా? కియా పరిశ్రమకు వచ్చాక దొంగిలించారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కేసు విచారణ దాదాపు పూర్తి అయ్యిందని త్వరలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశముంది.