Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేపట్టిన అరకు జిల్లా పర్యటన ముగిసింది. అంతకుముందు జిల్లాలోని డుంబ్రిగుడ మండలం కురిది గ్రామం (Kuridi Village) లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం (Rachabanda Programme)లో జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంజాయి వద్దు.. తులసి వద్దు అంటూ స్థానికుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
వాలంటీర్ వ్యవస్థపై
కురిది గ్రామ రచ్చబండలో డిప్యూటీ పవన్ కల్యాణ్.. తొలుత వాలంటీర్ వ్యవస్థ (AP Volunteers) గురించి మాట్లాడారు. వాలంటీర్లకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం (Ex YCP Government) ఎలాంటి ఆధారం లేకుండా చేసిందని పేర్కొన్నారు. దానిపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తో కేబినెట్ లో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. వాలంటీర్లకు జీతాలు కూడా ప్రభుత్వం నుండి ఇవ్వలేదన్న పవన్.. మీకు సంబందించిన వాలంటీర్ నాయకులను జీతాలు ఎలా ఇచ్చారో అడిగి తెలుసుకోవాలని సూచించారు.
రూ.25వేల కోట్లు దోచేశారు..
గత వైకాపా ప్రభుత్వం మద్యం పేరుతో రూ. 25 వేల కోట్లు దోచేసిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మద్యాన్ని ఏ విధంగా దోచుకున్నారో వాలంటీర్లను కూడా ఉద్యోగాల పేరుతో మోసం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం వాలంటీర్లను త్రిశంఖ చక్రంలో పడేసిందని అన్నారు. వాలంటీర్లను తీసుకున్నప్పుడు సేవ చేయడానికి మాత్రమే అని గత ప్రభుత్వం చెప్పిందని వారికి ఆర్థిక శాఖ నుంచి కేటాయింపులు సైతం జరపలేదని చెప్పారు.
వ్యాధిపై స్పెషల్ డ్రైవ్
స్థానికంగా ఉన్న సికిల్ సెల్ ఏలేమియా వ్యాధి బాధితులకు బ్లడ్ అవసరం ఎంతో ఉందని పవన్ అన్నారు. CSR నిధులతో వాటిని అందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ వ్యాధిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దానిని కేబినేట్ దృష్టికి తీసుకెళ్తానని పవన్ హామీ ఇచ్చారు. అలాగే సీఎం చంద్రబాబుతో చర్చించి అంగన్వాడీలతో ఇక్కడి పిల్లలకు పోషక పదార్దాలు అందించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
Also Read: Pawan Kalyan Son Injured: పవన్ కుమారుడి ఆరోగ్యంపై కీలక అప్ డేట్.. స్వయంగా పంచుకున్న చిరు!
గంజాయి వద్దు
2018లో వచ్చినప్పుడు విన్న అన్ని సమస్యలు.. తనకు ఇంకా గుర్తున్నాయని పవన్ అన్నారు. అందుకే మళ్లీ తిరిగి వచ్చినట్లు చెప్పారు. అరకులోని వేల ఎకరాల భూమిలో కాఫీ (Coffee) పంట పండిస్తున్నారని పవన్ గుర్తుచేశారు. ఇక్కడ ఉన్న భూములను అందరికి అందుబాటులోకి వచ్చేలా చేస్తున్నట్లు చెప్పారు. ఉసిరి, స్టాబేర్రి లాంటి పంటలు సైతం పండించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలా పండించిన పంటలను అటవీ శాఖ ద్వారా విశాఖలో మార్కెటింగ్ చేస్తామని అన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో గంజాయి సాగుపై విపరీతంగా చర్చ జరిగిన నేపథ్యంలో.. గంజాయి కంటే తులసి మెుక్క నాటడం మంచిదని పవన్ అన్నారు.