Pawan Kalyan Son Injured: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawana Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark shankar pawanovich) అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. సింగపూర్‌లోని రివర్ వ్యాలీ షాప్‌హౌస్‌లో మంగళవారం ఉదయం 9.45 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనకు రేకెత్తించింది. ఈ ఘటనపై పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
Also Read: Pawan Kalyan Son Injured: పవన్ కుమారుడికి తీవ్రగాయాలు.. పూజల్లో పవన్, గ్రామస్తులు
తన సోదరుడు కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్.. ప్రమాదానికి గురికావడంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తొలిసారి స్పందించారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయన్న చిరు.. అతడు త్వరగా కోలుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సైతం ఘటనపై స్పందించారు. ఈ వార్తతో తాను షాక్ కు గురైనట్లు చెప్పారు. బాబు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) సైతం.. పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.