Pawan Kalyan Son Injured: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు పెను ప్రమాదం తప్పింది. పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవా దంపతుల చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. తాజాగా సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకొని తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హడావుడిగా అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని సింగపూర్ కు వెళుతున్నట్లు సమాచారం.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవా ను వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వీరికి మార్క్ శంకర్ అనే చిన్న కుమారుడు కలడు. . పాఠశాలలో హఠాత్తుగా అగ్నిప్రమాదం జరగడంతో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతనికి చేతులు, కాళ్లకు గాయాలైనట్లు సమాచారం. అంతేకాకుండా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో అనారోగ్య స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి పాఠశాల యాజమాన్యం హడావుడిగా మార్క్ శంకర్ ను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తన కుమారుడు మార్కుశంకర్ కు గాయాలైనట్లు సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హడావుడిగా అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని సింగపూర్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కురిడి గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తి చేయడంతో ఆ కార్యక్రమంలో పాల్గొని సింగపూర్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైనట్లు సమాచారం అందుకున్న మెగా ఫ్యామిలీ అసలేం జరిగిందనే కోణంలో వివరాలు ఆరా తీస్తున్నారు.
పవన్ పూజలు..
అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తన కుమారుడి ఆరోగ్యం కుదుటపడాలని పూజలు చేశారు. డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముందుగా కురిడి గ్రామాల్లోని శివాలయాన్ని దర్శించుకున్నారు. 2018లో తొలిసారి కురిడి గ్రామానికి వచ్చిన పవన్ కళ్యాణ్, ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఆ రెండోసారి శివుణ్ణి దర్శించుకుని గ్రామస్తులతో మాట్లాడారు.
నిన్న డుంబ్రిగూడ సభలో కురిడి వస్తానని మాట ఇచ్చిన పవన్, పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో గాయపడ్డారని తెలిసినా గ్రామస్తులకు ఇచ్చిన మాట కోసం మొక్కు తీర్చుకోవడానికి రావడంతో గ్రామస్తులు ఒక్కొక్కరు, ఆయన కుమారుడి యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు కూడా పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆలయంలో పూజలు నిర్వహించి దేవుడిని వేడుకున్నారు. ఈ పర్యటన అనంతరం పవన్, సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు.