Ram Charan ( Image source : Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Ram Charan Peddi Movie: ” పెద్ది ” దెబ్బకు రికార్డులు బ్రేక్.. రిలీజ్ కు ముందే చరిత్ర సృష్టించిన రామ్ చరణ్

Ram Charan Peddi Movie: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవలే ఎన్నో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో పుష్ప 2 ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పెద్ది’ ( Peddi Movie ) మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ గ్లింప్స్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త రికార్డు సృష్టించాడు. 24 గంటల్లోపే ” పెద్ది ” గ్లింప్స్ ఒక్క తెలుగులోనే 30 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఇక మొత్తం భాషల్లో కలిపి 35 మిలియన్స్ దాటి రికార్డు బ్రేక్ చేసింది.

Also Read:  Vikramarka on HCU Issue: డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. విద్యార్థులపై ఉన్న కేసులను తీసివేయండి..

ఈ వ్యూస్ 24 గంటల్లోపే రావడంతో చరణ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. రామ్ చరణ్ ఈ పెద్ది గ్లింప్స్ వ్యూస్ తో అల్లు అర్జున్ పుష్ప 2, దేవర ను దాటేశాడు. అల్లు అర్జున్ పుష్ప 2 హిందీ గ్లింప్స్ 24 గంటల్లో 27.6 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించాయి. ఎన్టీఆర్ దేవర చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 26 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం గ్లింప్స్ 21 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. పుష్ప 2 తెలుగు గ్లింప్స్ 20 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించాయి.

Also Read: chilukur balaji temple: రేపటి నుండి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు.. ఈసారి ఆ ప్రసాదం లేనట్లే!

గేమ్ ఛేంజర్ ” మూవీతో డల్ అయిన రామ్ చరణ్ కు పెద్ది మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ వ్యూస్ కేవలం 24 గంటల్లోపే సాధించడంతో చెర్రీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రిలీజ్ కు ముందే ఇలా ఉంది అంటే ఇంకా ముందు ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. అయితే, పాన్ ఇండియా వైడ్ చూస్తే యష్ టాక్సిక్ గ్లింప్స్ 36 మిలియన్స్ వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండగా .. ఇప్పుడు పెద్ది చిత్రం గ్లింప్స్ అల్లు అర్జున్ పుష్ప 2 ని క్రాస్ చేసి రెండో స్థానంలో నిలిచింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు