Vikramarka on HCU Issue [image credit: twitter]
తెలంగాణ

Vikramarka on HCU Issue: డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. విద్యార్థులపై ఉన్న కేసులను తీసివేయండి..

Vikramarka on HCU Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. బీఆర్​ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం హైదరాబాద్​ సెంట్రల్ యూనివర్సిటీ టీచర్స్​ అసోసియేషన్​, సివిల్​ సొసైటీ గ్రూపులతో ఈ వ్యవహారంపై సీఎం రేవంత్​ రెడ్డి నియమించిన సబ్​ కమిటీ సమావేశమైంది.

 Also Read: Jagityal mango farmers: దళారుల దందా నిలిపివేయండి .. మా మోర ఆలకించండి.. కలెక్టర్ కు రైతుల విన్నాపం

దీంట్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల వ్యవహారంలో ఇద్దరు విద్యార్థులను అరెస్ట్​ చేశారని, వాళ్లు ఇప్పటికీ జ్యుడిషియల్​ రిమాండ్​ లో ఉన్నారని టీచర్స్​ అసోసియేషన్​, సివిల్ సొసైటీ గ్రూపుల ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారు. వీరిపై నమోదైన కేసులను ఉపసంహరించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

 Also Read: Petrol Diesel Prices: వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

ఈ క్రమంలో స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు ఇవ్వాలని న్యాయశాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్​ డీజీ శివధర్​ రెడ్డి, సైబరాబాద్​ కమిషనర్​ అవినాష్​ మహంతి, న్యాయశాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?