Warangal Job Mela: ఈ నెల 11న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా ఈస్ట్ లో మంత్రి కొండా సురేఖ చొరవతో నిర్వహిస్తున్నారు. సుమారు 100కంపెనీలు 8వేలకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సోమవారం మంత్రుల నివాస సముదాయంలోని ఆమె నివాసంలో మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. జాబ్ మేళా నిర్వాహకులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జాబ్ మేళాకు వచ్చే యువతీ, యువకులకు మౌలిక సదుపాయలు కల్పించాలని సూచించారు. జాబ్ మేళా వద్ద అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, పోలీసులు, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జాబ్ మేళాకు 60 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోగా మరో 40 నుంచి 50 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also read: HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?
8వేలకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో కొండా సుష్మిత్ పటేల్ ప్రతి ఏటా జాబ్ మేళా నిర్వహిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పదోవ తరగతి నుంచి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జెన్ ప్యాక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, జెప్టో, జీఎంఆర్, టెక్ మహీంద్ర పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయి. మేళాకు వచ్చే విద్యార్థులకు భోజన వసతి సైతం ఏర్పాటు చేయాలని సూచించారు.
క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్ రోల్ చేసుకోవాలన్నారు. వరంగల్ లోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ లోజాబ్ మేళా నిర్వహిస్తున్నారు.