Gajwel Crime (image credit:Canva)
క్రైమ్

Gajwel Crime: మారణాయుధాలు.. నకిలీ ఆధార్ కార్డులు.. గ్యాంగ్ అరెస్ట్..

Gajwel Crime: గంజాయికి అలవాటు పడ్డారు. అలాగే తాము సేవిస్తూ ఇతరులను గంజాయికి అలవాటు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను, మారణాయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 920 గ్రాముల గంజాయి, రూ 33,000 నగదు తో పాటు రెండు బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ములుగు ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ములుగు మండలం కొట్యాల గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు రైడింగ్ చేయగా ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు.

వారి వద్ద విక్రయించడానికి 920 గ్రాముల గంజాయి ఉండగా రూ 33 000 నగదు పట్టుబడింది. వీటితోపాటు రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్ లను నిందితుల నుండి స్వాధీనం చేసుకొని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినట్లు ఎస్సై తెలిపారు.

నిందితులు మర్కుక్ మండలం, కర్కపట్ల గ్రామానికి చెందిన సారా నవీన్ 21, బొమ్మలరామారం మండలం మునిరాబాద్ జలాల్పూర్ కు చెందిన కేతావత్ సంజయ్ కుమార్ 20, మేడ్చల్ జిల్లా అహ్మద్ గూడా గ్రామం సోమాజిపల్లి తండాకు చెందిన కార్తీక్ 20, మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన సారా అశోక్ 20, అదే గ్రామానికి చెందిన సారా సుధాకర్ 23 లు ఉన్నారు.

గంజాయి సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదని అలాగే విక్రయించడం చట్టపరంగా నేరమని యువకులు గుర్తించాలని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసినా సేవిస్తున్నట్లు సమాచారం అందిన తమకు తెలియజేయాలని లేకుంటే యువకులు చెడు వ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటారని తల్లిదండ్రులు, గ్రామస్తులు గుర్తించాలని సూచించారు.

Also Read: Eagle Squad: తెలంగాణ పోలీసుల చేతికి కొత్త అస్త్రం.. ఇక వారికి చుక్కలే..

మారణాయుధాలతో ఉన్న ముగ్గురు అరెస్ట్
వర్గల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు వెంటాడి పట్టుకుని తనిఖీలు చేయగా వారి వద్ద మారణాయుధాలు ఉన్నట్లు కనుగొన్నారు. రామాయపేట మండలం నస్కల్ గ్రామ బాలాజీ నగర్ కు చెందిన ఎండి ఎదియాజ్ 22, వద్ద 33 బుల్లెట్లు వాడిన లేట్ కోహ్లీ మొబైల్ ఫోన్లు నకిలీ ఆధార్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే హిదాయత్ సికింద్రాబాద్ నేరేడుపెట్ ప్రాంత నివాసి కాగా, మరో వ్యక్తి మద్దూర్ బాబు గచ్చిలాల్ పేట బాలాజీ నగర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వాసిగా గుర్తించారు. వీరిని కూడా అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?