Anakapalle Road Accident: ఇటీవలే, రోడ్డు ప్రమాద ఘటనలు ఎక్కువవుతున్నాయి. అతి వేగం వలన జాతీయ రహదారి పై ఈ ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా, అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీని వెనుక నుంచి ఆటో ఢీకొంది. ఈ ఘటనలో మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరుగురిలో ఇద్దరికీ తీవ్రగాయలు, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులు విశాఖకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి, ఈ ప్రమాదం ఎలా జరిగింద? వాటికీ సంబందించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న వెల్లడించారు.