Jay North: ” డెన్నిస్ ది మెనేస్ ” లో డెన్నిస్ మిచెల్ అనే ఐకానిక్ పాత్రకు ప్రాణం పోసిన జే నార్త్ 73 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన గత కొంత కాలం నుంచి క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన ప్రాణాలు విడిచారు. ఈ వార్తను ఆయన స్నేహితుడు జీనీ రస్సెల్ తెలిపారు. బాల నటుడిగా తన సినీ కెరీర్ ను ప్రారంభించి టీవీ నటుడుగా ఎదిగారు. ఈ సందర్భంగా అమెరికన్ నటీ నటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
Also Read: Sekhar Basha: సమాజంలో తలెత్తుకోలేకున్నాం.. హీ టీమ్స్ కావాలి.. స్త్రీ బాధితుల డిమాండ్!
“జీన్ రస్సెల్ మాకు ఫోన్ చేసి బాధాకరమైన వార్త చెప్పారు. ఇది మేము అస్సలు ఊహించలేదు. నా ప్రియమైన స్నేహితుడు జే నార్త్ చాలా సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆయన ఈ రోజు ఉదయం తన ఇంట్లో ప్రశాంతంగా మరణించారు” అంటూ లారీ జాకబ్సన్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా సంతాపం తెలిపారు.
Also Read: Sri Rama Navami: భద్రాద్రిలో ముమ్మరంగా శ్రీరామనవమి ఏర్పాట్లు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ది మ్యాన్ ఫ్రమ్ అంకుల్, ది లూసీ షో, లాస్సీ, జనరల్ హాస్పిటల్, ది సింప్సన్స్ వంటి సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. ఇంకా, అతను జీబ్రా ఇన్ ది కిచెన్ (1965), మాయ (1966), ది టీచర్ (1974) మరియు డిక్కీ రాబర్ట్స్: ఫోర్మర్ చైల్డ్ స్టార్ (2003) వంటి మూవీస్ లో కూడా నటించాడు.