Fake Hair Growth Scam: ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. అక్కడ పెద్ద క్యూనే నిలబడింది. ఒక్కొక్కరు పరుగులు పెట్టి మరీ అక్కడికి వచ్చేస్తున్నారు. ఇదేదో బంపర్ ఆఫర్ అనుకుంటే పొరపాటే. అంతేకాకుండా ఏదైనా ఫ్రీగా పంపిణీ చేస్తున్నారేమో అని అనుకుంటున్నారా? అది కూడా కాదు సుమా.. అసలు ఎందుకు ఇక్కడ, ఇంత పెద్ద క్యూ ఉందో తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని పాతబస్తీ ఫతే దర్వాజా వద్ద వందలాది మంది యువకులు క్యూ కట్టేస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకటే క్యూ. ఇక్కడ బిగ్ బాస్ సెలూన్ అంటూ ఓ షాప్ ఉంది. అందరూ వచ్చేది ఇక్కడికే. అదేదో కటింగ్ కోసం ఇక్కడికి వస్తున్నారని అనుకోవద్దు. పెద్ద కారణమే ఈ క్యూ కు కారణం.
ఇక్కడ షకీల్ భాయ్ అనే అతను పెద్ద ఫేమస్. ఎలాగంటారా.. బట్ట తలపై జుట్టు మొలిపిస్తానంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇటీవల ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ ఫేమ్ యాక్టర్ కు జుట్టు మొలిపించానని ప్రచారం సాగించాడు. ఇంకేముంది పని ఒత్తిడితో, ఇతర కారణాలతో బట్టతల కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ పాతబస్తీ ఫతే దర్వాజా దారి పట్టారు.
దీనితో ఎప్పుడు చూసినా బిగ్ బాస్ సెలూన్ ముందు పెద్ద క్యూనే కనిపిస్తోంది. ఫలితం ఎలా ఉంటుందో కానీ, ఫస్ట్ ట్రై చేద్దాం అంటూ వచ్చేవారు కొందరు, నమ్మి వచ్చేవారు మరికొందరు.. ఇలా బిగ్ బాస్ సెలూన్ దారి పట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఓ వివాదం సైతం ఇక్కడ వినిపిస్తోంది. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ చెబుతున్న షకీల్ బాయ్.. బట్టతలపై ఏదో కెమికల్ ను పూయడం రుద్దడం వంటి చర్యలు చేపడతారు. దీని ద్వారా కొందరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్ రావడంతో ఏమి చేయాలో దిక్కు తోచక, వైద్యశాలల దారి పట్టారట కొందరు.
Also Read: సమ్మర్ ఎఫెక్ట్.. కొండెక్కిన నిమ్మకాయలు.. బాబోయ్ మరీ అంతనా!
అదే ఇప్పుడు వివాదంగా మారింది. అసలే.. బట్టతలతో బాధపడుతున్న వారు, సైడ్ ఎఫెక్ట్ రావడంతో మరింత ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ విషయంపై సంబంధిత అధికారులు దృష్టి సారించి ఇటువంటి వాటిని అరికట్టాలని కొందరు సూచిస్తున్నారు. మరికొందరేమో తమకు మంచి ఫలితాలు ఉన్నాయని తమ వాదన వినిపిస్తున్నారు. అయితే ఒక్కో గుండుకు రూ.200 వసూలు చేసినట్లు సమాచారం.
బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ బడా మోసం..
ఢిల్లీ నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ పాతబస్తీకి వచ్చిన నకీల్ అనే యువకుడు
బిగ్ బాస్ పేరుతో పాతబస్తీలో సెలూన్ షాప్ నడిపిస్తున్న వకీల్
గుండు గీసి కెమికల్స్ రాసి పంపిస్తున్న వకీల్
ఒక్కో గుండికి రూ.200 వసూలు
బిగ్ బాస్ సెలూన్ కి… pic.twitter.com/pO8FPO6S2o
— BIG TV Breaking News (@bigtvtelugu) April 7, 2025