MLA Raja Singh: నేడు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో శోభా యాత్ర ఘనంగా జరిగింది. ఎక్కడా చూసిన కాషాయ జెండాలు,శ్రీరాముని నినాదాలే వినిపిస్తున్నాయి. అయితే, ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయనకు రామ భక్తులు స్వాగతం పలికారు.
అయితే, ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ మాట్లాడుతూ ” స్వాతంత్రం వచ్చినప్పటి భారత దేశం కాదు ఇది అన్నారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. గతంలో రామ భక్తులు ఆలోచన, ఓర్పు తో ఉండేవారు. కానీ, ఇప్పుడు అలా ఎవరూ లేరు.. ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారని రాజా సింగ్ అన్నారు. భారత్ లో జిహాద్ పాతుకుపోయింది. మోడి వచ్చిన తర్వాత ఎవరైనా జిహాద్ కు పాల్పడాలి అంటే చాలా భయపడుతున్నారని తెలిపారు.
Also Read: Etala Rajender: మా పార్టీలో వారసత్వం ఉండదు.. అధ్యక్ష మార్పుపై ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఎందుకంటే, జిహాద్ కు పాల్పడితే ఇంట్లోకి బుల్డోజర్ లు వస్తాయనే భయం అందరికీ పట్టుకుందన్నారు. వక్ఫ్ బోర్డ్ బిల్ పార్లమెంట్ లో పాస్ చేశారు. గతంలో ఎన్నో భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వక్ఫ్ భూములు అంటూ బోర్డ్ లు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. వక్ఫ్ బోర్డ్ రాకముందు వాళ్ళ 4వేల ఎకరాల భూములు ఉండేవని, దీనిని అడ్డు పెట్టుకొని ఇప్పటి వరకు మొత్తం 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని రాజా సింగ్ ఆరోపించారు.
మోడి బిల్లు తీసుకురావడం ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరికి నిజమైన భూములు ఉంటాయి వారికి రక్షణ కల్పిస్తాడని అన్నారు. వక్ఫ్ బిల్ పాస్ అయిందని ఒవైసీ బ్రదర్స్ గోల గోల చేసున్నారని, వారి మీద మండి పడ్డారు. ఒవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరు భయపడరని అన్నారు. త్వరలో నరేంద్ర మోడి, భారత్ ను హిందు రాష్ట్రం గా చేసే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. మనమందరం కలిసి ఉండి, మోడీకి అండగా నిలవాలి. ముస్లింలను మోసం చేస్తున్న వ్యక్తి ఒవైసీ పేర్కొన్న రాజా సింగ్ , ముస్లింలకు మోడి , యోగి, రాజా సింగ్ వారి దుష్మన్ కాదన్నారు.
ఓ వైపు మోడి , ఇంకో వైపు యోగిని దేశం మొత్తం చూస్తుందని, రాం మందిర్ నిర్మాణం జరగదని ఓవైసీ భావించారు. కానీ, నేడు శ్రీ రామనవమి రోజున గుడికి వచ్చిన జనసంద్రాన్ని చూసి ఒవైసీ ఖంగుతిన్నారని ” అన్నారు.