Etala Rajender: అధ్యక్ష మార్పు అంశంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. తమ పార్టీలో వారసత్వం ఉండదని స్పష్టం చేశారు. అధ్యక్షులు పదేండ్లు, ఇరవై ఏండ్లు ఉండబోరని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
గాంధేయ సోషలిజమే తమ ఎజెండా అని పేర్కొన్నారు. దేశంలో 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్ ఉందని పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓటు సాధించి సగం ఎంపీ సీట్లను గెలుచుకున్నామని, భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం బీజేపీదేననే మెసేజ్ ఇప్పటికే ప్రజలు అందించారని, అందుకు అనుగుణంగా నాయకులంతా కలసి పనిచేయాలని ఈటల పిలుపునిచ్చారు.
Also read: BRS Party: సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ డైలమా? బీఆర్ఎస్ సభ అనుమతి వచ్చేనా?
ప్రజల్లో విశ్వాసం కలిగించేలా పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ పరిపాలన అనుభవమైందని, మళ్లీ వారికి ఓటు వేసే ప్రసక్తి లేదని ప్రజలు చెబుతున్నారన్నారు. ఇకపోతే కాంగ్రెస్ 10 నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో విఫలమైందని ఈటల పేర్కొన్నారు. అందుకే ఇప్పుడంతా బీజేపీ వైపు చూస్తున్నారని రాజేందర్ తెలిపారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/