Rain Alert: తెలంగాణకు మరో సారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే, ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.
ఈ నెల 7తేదీన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో వర్షం కురుస్తుంది. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏప్రిల్ 8వ తేదీన సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, , వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read: Trivikram Srinivas: త్రివిక్రమ్ చెప్పిన ‘జై ఎన్టీఆర్’ మీనింగ్ ఇదే.. ఇక ఫ్యాన్స్‌ని ఆపతరమా?
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు?
ఏపీలోని కొన్ని జిల్లలో ఐదు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, అలాగే ఈ రోజు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు.