Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసే కథలకు, వేసే పంచులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాలలోని పంచ్‌లు, ప్రాసల కోసం రీపీటెడ్ ఆడియెన్స్ ఉంటారంటే అస్సలు అతిశయోక్తి కాదు. ఈ మధ్య కాస్త సీరియస్ మోడ్‌లో వెళ్లిపోతున్నాడు కానీ, ఆయన గట్టిగా టార్గెట్ పెట్టి సినిమా తీస్తే.. రాజమౌళి సినిమాల రికార్డులు కూడా బద్దలవుతాయి. కానీ, స్టార్‌డమ్‌ని నమ్ముకుంటూ ప్రస్తుతం ఆయన జర్నీ నడిపిస్తున్నారు. కేవలం నలుగురే హీరోలతో త్రివిక్రమ్ జర్నీ కొనసాగిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ నలుగురితోనే ఆయన సినిమాలు చేస్తున్నారు. మరో హీరోకి ఛాన్స్ ఇవ్వడం లేదు. మధ్యలో నితిన్‌తో మాత్రమే ఆయన సినిమా చేశారు. ఇప్పుడు కూడా మహేష్‌తో చేసిన ‘గుంటూరు కారం’ తర్వాత, మరోసారి అల్లు అర్జున్‌తోనే ఆయన సినిమా చేయబోతున్నారు. అల్లు అర్జున్‌తో ఇప్పటి వరకు ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలను త్రివిక్రమ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read- Sampoornesh Babu: 8 ఏళ్ళ తర్వాత బిగ్ బాస్ గురించి అసలు నిజం చెప్పిన సంపూర్ణేష్ బాబు
అంతేకాదు, ఉంటే పవన్ కళ్యాణ్ వెంట లేదంటే ఎన్టీఆర్ (Jr NTR)తో ఎక్కువగా త్రివిక్రమ్ కనిపిస్తూ ఉంటారు. ఎన్టీఆర్‌తో ఆల్రెడీ ‘అరవింద సమేత వీరరాఘవ’ అనే చిత్రం చేసిన త్రివిక్రమ్.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే మరో చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో ఆ మధ్య ఓ స్టేజ్‌పై ప్రత్యేకంగా తారకే చెప్పుకొచ్చాడు. అంతటి మంచి బాండింగ్‌ని త్రివిక్రమ్ తన హీరోలతో కొనసాగిస్తూ ఉంటారు.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘మ్యాడ్ స్వ్కేర్’ సక్సెస్ మీట్‌కు తారక్, త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మరోసారి గురూజీ తనకే సొంతమైన ఉపన్యాసంతో ఈవెంట్‌కు వచ్చిన వారందరినీ అలరించారు. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ ‘జై ఎన్టీఆర్’ (Jai NTR) అని అరుస్తుండగా.. ఆ పదం తనకి ఏ విధంగా వినబడిందో చెప్పి.. నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు. ఇంకా చెప్పాలంటే ‘జై ఎన్టీఆర్’ అర్థమే మార్చేశారు.
Also Read- Jr NTR: పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పిన తారక్.. మోత మోగిందిగా!
ఇంతకీ త్రివిక్రమ్ ఏమన్నారంటే.. ‘‘మ్యాడ్ టీమ్ యాక్టర్లకి, టెక్నీషియన్స్‌కి అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఇంటి ఫంక్షన్‌లో మన వాళ్ళని మనమే పొగొడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడటం లేదు. నేను ఒకే ఒక విషయం చెప్పి ఈ ఉపన్యాసం ముగిస్తాను. నాకు ఇందాకటి నుంచి ‘జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్’ అని అక్కడి నుంచి ఫ్యాన్స్ అరుస్తుంటే.. అది నాకు ‘జైంట్’ (Jaint) అని వినిపిస్తుంది. ఆయన నిజంగానే జైంట్. ఇక ఆలస్యం చేయకుండా ఈ చిన్ని మైక్‌ని ఆ జైంట్ చేతిలో పెట్టేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘జై ఎన్టీఆర్’ గురించి ఆయన చెబుతున్న వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు