Sampoornesh Babu: హీరో సంపూర్ణేష్ బాబు బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో చిన్న హీరో అనుకుని అంతగా పట్టించుకోలేదు కానీ, హృదయ కాలేయం చిత్రంతో సాధారణ హీరోగా ఉన్న సంపూర్ణేష్ ఒక్క సారిగా స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని మూవీస్ చేస్తూ ఫ్యాన్స్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే, త్వరలో “సోదరా ” అనే చిత్రంతో ప్రేక్షుకుల ముందుకు రానున్నాడు. ” హృదయ కాలేయం ” విడుదలయ్యి 11 ఏళ్ళు ఐన క్రమంలో సంపూర్ణేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: Hyd Local Body Elections: హైదరాబాద్ లో ఎన్నికల హీట్.. సై అంటోన్న బీజేపీ-ఎంఐఎం.. గెలుపు ఆ పార్టీదేనా?
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. వారి సొంత టాలెంట్ తో పైకి వస్తారు. అలాంటి వారిలో హీరో సంపూర్ణేష్ బాబు ( Sampoornesh) కూడా ఒకరు. ఇప్పటికి తన సొంతూరులో సాధారణ మనిషిగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి చిత్రాల గురించి, బిగ్ బాస్, తన లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
సంపూర్ణేష్ బాబు తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 ( Bigg Boss ) కి వెళ్ళాడు. అయితే, 9 రోజులు కూడా ఉండలేకపోయాడు. వామ్మో అక్కడ నా వల్ల కాదు.. నేను ఇంక ఉండలేనంటూ బయటకు వచ్చేశాడు. ఈ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. తాజాగా, ప్రెస్ మీట్ లో దీనిపై మరోసారి రియాక్ట్ అయ్యాడు.
Also Read: Sailesh Kolanu: ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఎలా లీక్ చేస్తారు.. టాలీవుడ్ డైరెక్టర్ సంచలన ట్వీట్
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. ” నాకు బిగ్ బాస్ గురించి ముందు తెలియదు.. అప్పట్లో దాని గురించి నాకు పెద్దగా అవగాహన కూడా లేదు. మంచి అవకాశం వచ్చింది వెళ్ళమని సపోర్ట్ చేయడంతో అక్కడికి వెళ్ళాను. కానీ, అక్కడ లైఫ్ అంతా రిచ్ గా కొత్తగా అనిపించింది. అలా ఒక ఇంట్లో బంధించి ఉంచడం నాకు ఏదోలా అనిపించింది. అలా జీవించడం నా వల్ల అస్సలు కాలేదు. అందుకే ఆ షోలో ఏడ్చాను. ఎన్టీఆర్ నాకు చాలా సపోర్ట్ చేశారు .. అయిన అక్కడి నుంచి మధ్యలోనే వచ్చేసాను. అలా బిగ్ బాస్ నుంచి మధ్యలో రావడం .. దురదృష్టకరం. షో నుంచి బయటొచ్చాక చాలా మంది ఫోన్ చేసి అలా ఎందుకు చేశావ్ అని నా మీద సీరియస్ అయ్యారు. ఆ సమయంలో చాలా ఫీల్ అయ్యానని” ఆయన మాటల్లో చెప్పుకొచ్చాడు.