Mad Square Success Meet Event
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పిన తారక్.. మోత మోగిందిగా!

Jr NTR: మెగా, నందమూరి అభిమానులు ఒకరినొకరు సోషల్ మీడియాలో ఎప్పుడూ దూషించుకుంటూ ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ మెగా, నందమూరి అభిమానుల మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూ ఉంటుంది. కానీ ఆ కుటుంబాల హీరోలు మాత్రం ఎప్పుడూ మేము కలిసే ఉన్నామని హింట్ ఇస్తూనే ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య సందర్భం వచ్చిన ప్రతిసారి.. సినిమాల మధ్య మాత్రమే మాకు పోటీ ఉంటుంది.. మిగతా టైమ్‌లో మేమంతా అన్నదమ్ముల్లా ఉంటామని చెబుతుంటారు. అయినా అభిమానులు మాత్రం వినరంటే వినరు.

ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి, మేము ప్రాణ స్నేహితులమని చెప్పుకొచ్చారు, ప్రమోషన్స్‌లో నిరూపించారు కూడా. అయినా, ఆ సినిమా తర్వాత ఒకరికి ఇంపార్టెన్స్ ఉందంటే, మరొకరి లేదు అనేలా వార్ నడిచింది. ఇవన్నీ ఇలా ఉంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంంలో అందరి హీరోల అభిమానులను ఒక తాటి మీదకి తీసుకురావడానికి చాలానే ప్రయత్నించారు. అది చాలా వర్కవుట్ వర్కవుట్ అయింది కూడా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, పబ్లిక్ స్టేజ్‌పై పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ చెప్పి.. మరోసారి వారి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో తెలియజేశారు.

Also Read- Vijay Deverakonda: బాలీవుడ్‌లో భారీ దెబ్బతిని.. అలా మాట్లాడవచ్చా కొండా!

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ మీట్‌కు తారక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా సక్సెస్ వెనుకు ఉన్న వ్యక్తి గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని డైలాగ్‌ని గుర్తు చేసుకున్నారు. ‘అత్తారింటికి దారేది మూవీ ఒక డైలాగ్ ఉంటుంది. నీ వెనకాల కనబడని శక్తి ఉంది అని. వీళ్లందరి వెనకాల కనబడని ఆ శక్తే మా చింటూ.. వంశీ’ అని ఎన్టీఆర్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అందరినీ కలిసి చాలా కాలం అయింది. నాగవంశీ పుణ్యాన అందరం కలుసుకోగలిగాం.

నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోతాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్‌గా మనకు దొరికాడు. ‘మ్యాడ్ 2’తో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్‌కి కంగ్రాచులేషన్స్. ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత.. సీక్వెల్‌తో అంతకంటే గొప్పగా ప్రేక్షకులను రంజింపజేయడం చాలా కష్టం. కానీ కళ్యాణ్ అది సాధించగలిగాడు. ఎందుకంటే ఆయనది స్వచ్ఛమైన హృదయం. మీ గుండె ఆ స్వచ్ఛతను ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన గొప్ప గుణం అని అన్నారు.

Also Read- Priyanka Chopra: మరో టాలీవుడ్‌ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. నిజమైతేనా?

తన బావమరిది గురించి మాట్లాడుతూ..
‘‘మ్యాడ్ 1లో రామ్ నితిన్ యంగ్‌గా ఉన్నాడు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. కెమెరా ముందు నిల్చోవడం అంత తేలిక కాదు. ‘మ్యాడ్’లో రామ్ నితిన్ అద్భుతంగా నటించాడు. కామెడీ పలికించడం, పండించడం యాక్టర్‌కి చాలా కష్టం. అందుకే నేను ‘అదుర్స్-2’ చేయడానికి ఆలోచిస్తున్నాను. రామ్ నితిన్‌కి మంచి భవిష్యత్ ఉంది. నాకు 2011లో పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడు. మాట్లాడటానికి కూడా భయపడేవాడు.

అలాంటి నితిన్ నాతో ధైర్యంగా చెప్పిన ఒకే ఒక్క మాట.. బావ నేను యాక్టర్ అవుతాను అని. నీ చావు నువ్వు చావు నాకు తెలీదు అని చెప్పా, ఇవాళ వాడి కష్టంతో గొప్పోడయ్యాడు. నేను నీ మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళు అని చెప్పాను. నా సపోర్ట్ లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకి వెళ్ళాడు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉంది. మంచి దర్శకులు, మంచి నిర్మాతలతో పని చేశాడు కాబట్టే నటుడిగా విజయాలు అందుకుంటున్నాడు’’ అని తారక్ చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ