Priyanka Chopra: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా పేరు ఈ మధ్య బాలీవుడ్‌లో కంటే, టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం SSMB29లో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా నటిస్తోంది. అయితే అది హీరోయిన్‌గానా? లేదంటే వేరే ఇతర పాత్రలో నటిస్తుందా? అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రియాంకా చోప్రాతో పాటు ఆమె మదర్ చెబుతున్న మాటల ప్రకారం ఇందులో పీసీ ఓ కీలక పాత్రలో నటిస్తుందన్నది మాత్రం అర్థమవుతుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర చిత్రీకరణ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రియాంకా చోప్రాకు టాలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫర్ తగిలినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’పై ఈ వార్తలేంటి? అంతా అనిల్ రావిపూడి మాయ!
వాస్తవానికి బాలీవుడ్ నుండి ప్రియాంకా చోప్రా హాలీవుడ్ వెళ్లిపోతున్నట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌లో తనకున్న ఆస్తులన్నింటిని ప్రియాంకా చోప్రా అమ్మేస్తుందని, హాలీవుడ్‌లో తన మకాంను ప్రిపేర్ చేసుకుంటుందనేలా టాక్ వచ్చిన అనంతరం, సడెన్‌గా హైదరాబాద్‌లో ఆమె ప్రత్యక్షమైంది. ఆ తర్వాత రాజమౌళి టీమ్‌తో కనిపించింది. దీంతో అంతా మహేష్‌తో రాజమౌళి చేస్తున్న సినిమాలో ప్రియాంకా చోప్రా నటిస్తుందనేలా క్లారిటీకి వచ్చేశారు. ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన మరో స్టార్ హీరో చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చిందనే వార్తలు వింటుంటే.. ఆమె పయనం హాలీవుడ్‌కా? టాలీవుడ్‌కా? అనేలా అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, రాజమౌళి చేస్తున్న సినిమాలో అస్సలు ప్రియాంకా చోప్రా పేరును ఊహించలేదు. మొదటి నుంచి ఆ సినిమా కోసం హాలీవుడ్ భామని రాజమౌళి సెర్చ్ చేస్తున్నట్లుగానే వార్తలు వచ్చాయి. కట్ చేస్తే, ప్రియాంకా చోప్రా ఆ టీమ్‌తో యాడయింది.
Also Read- Heroine: పెళ్లి చేసుకున్నా.. ఈ హీరోయిన్‌కి ఆ కోరిక చావలేదు.. బుల్లి బుల్లి నిక్కర్లలో!
ఇక ఆమెకు వచ్చిన మరో ఆఫర్ విషయానికి వస్తే.. ‘పుష్ప 2’ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా పేరును పరిశీలిస్తున్నారనేలా టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజముందనేది తెలియదు కానీ, నిజంగా ఈ వార్త నిజమైతే మాత్రం.. కచ్చితంగా ఆమె మకాం సౌత్‌కే అని ఫిక్సయిపోవచ్చు. అయితే సౌత్ హీరోలతో ప్రియాంక చోప్రా ట్రాక్ రికార్డ్ అయితే ఏమంత గొప్పగా లేదు. ఆల్రెడీ ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ‘జంజీర్’ అనే చిత్రంలో చేశారు. ఆ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా సౌత్ సినిమాగా తెరకెక్కలేదు. బాలీవుడ్ సినిమాగానే తెరకెక్కింది కాబట్టి.. సౌత్‌తో ఆమె ఫేట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చిందా? లేదా? అనేదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు