Heroine: పెళ్లి చేసుకున్నతర్వాత కూడా ఈ హీరోయిన్‌కి కోరిక చావలేదు అంటే.. ఏదేదో ఊహించుకుంటారేమో? మీరు ఊహించుకునే విషయమైతే కానే కాదులే కానీ.. కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత కామ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. మరికొందరు పెళ్లి అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పి.. సంసార బంధంలో బిజీగా గడుపుతూ, పిల్లలు కాస్త ప్రయోజకులు అవ్వగానే మళ్లీ ముఖానికి రంగేయాలని చూస్తుంటారు. అలా ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చారు. హీరో లేదంటే హీరోయిన్లకు అమ్మగా, అక్కగా, అత్తగా ఇలా ఏదో ఒక పాత్రలో కనిపించి వారి నటనను కొనసాగిస్తున్నారు. ఈ లిస్ట్ చెప్పుకుంటే ఇప్పుడు కాస్త ఎక్కువే ఉంది. ఇలా రీ ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్న సీనియర్ నటీమణుల జాబితా కూడా చాలానే ఉంది. కానీ ఇక్కడ చెప్పుకునే హీరోయిన్ మాత్రం యంగ్ హీరోయిన్. సినిమాలు కూడా ఎన్నో చేయలేదు. మహా అయితే ఓ ఐదారు సినిమాలు చేసి ఉంటుంది అంతే.
Also Read- Single First Song: ఇద్దరు భామలతో.. రొమాంటిక్ మూడ్‌లో శ్రీ విష్ణు
అలా సినిమాలు చేస్తుండగానే.. ఓ విలక్షణ నటుడిని పెళ్లి చేసుకుని, యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పేసింది. అయితే ఈ హీరోయిన్‌కు ఓ టాలెంట్ ఉంది. అదే డ్యాన్స్. ఆమె చేసిన ఆ ఐదారు సినిమాలలో కూడా ఆమె డ్యాన్స్‌తో అందరినీ అలరించింది. మంచి డ్యాన్సర్ అని పేరు కూడా సంపాదించుకుంది. అలాంటి నటి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ డ్యాన్స్‌ని మాత్రం వదలలేకపోతుంది. నటనకు గుడ్ బై చెప్పినప్పటికీ, డ్యాన్స్ విషయంలో తన కోరికని తన భర్త కూడా కాదనలేకపోతున్నాడు. అందుకే సోషల్ మీడియా వేదికగా ఆమె తన డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ.. తనలో ఇంకా ఆ టాలెంట్ అలాగే ఉందని నిరూపించుకుంటుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ, ఈ డ్యాన్స్ కోసం ఆమె వేసుకునే పొట్టి పొట్టి నిక్కర్లే.. అప్పుడప్పుడూ ఆమెను ట్రోల్ చేసేలా చేస్తుంటాయి. మంచి నటుడిని పెళ్లాడిన ఈ యంగ్ బ్యూటీ.. ఇలా బుల్లి బుల్లి నిక్కర్లలో దర్శనమిస్తుంటే, ఆ హీరో అభిమానులు కూడా చూడలేకపోతున్నారు. ఏంటీ వేషాలు అంటూ ఎన్నో సార్లు కామెంట్స్ కూడా చేశారు.
అయినా సరే, తన దారి తనదే. నా భర్తకే లేని ఇబ్బంది మీకేంటి? అంటూ ఈ గ్లామర్ డాల్ తన గ్లామర్ ప్రదర్శనతో డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూనే ఉంది. నిజంగా ఆమె డ్యాన్స్ చూడముచ్చటగా ఉంటుంది. ఇంత టాలెంట్ ఉన్న నువ్వు.. అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? సినిమాలకు ఎందుకు దూరమయ్యావ్? అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తుంటారంటే.. ఈ భామ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సరే.. ఇంతకీ ఆ బ్యూటీ పేరేంటో చెప్పలేదు కదా. సయేషా సైగల్. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఆర్య భార్య. ఆమె తల్లిదండ్రులు సుమీత్ సైగల్, షాహీన్ కూడా నటులే. తెలుగులో అఖిల్ అక్కినేని మొదటి చిత్రం ‘అఖిల్’తో సయేషా కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో.. సయేషా పేరు పెద్దగా వినబడలేదు. ఆ సినిమా హిట్టై ఉంటే మాత్రం సయేషా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అయి ఉండేది.
Also Read- Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ మళ్లీ వచ్చింది.. తెరపైకి అబ్బాయి.. కౌంటర్ అదుర్స్..
సయేషా, ఆర్య దంపతులకు ఓ పాప కూడా ఉంది. అయినా కూడా సయేషా తన టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ.. అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఇక్కడ ఓ విషయం చెప్పాలి.. ఆమె వేసుకునే డ్రస్‌పై కామెంట్ చేసే వారున్నారు కానీ, ఆమె డ్యాన్స్‌ని కామెంట్ చేసే ఒక్క నెటిజన్ కూడా లేడంటే.. ఆమె డ్యాన్సింగ్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సయేషా షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు