Vishwambhara: ఏజ్ జస్ట్ నెంబర్ అంతే.. అనేలా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలకు సైన్ చేసి ఉన్నారు. అందులో ఒకటి చివరి దశలో ఉండగా, మరొకటి తాజాగా ప్రారంభోత్సవం పూర్తి చేసుకుని రెగ్యులర్ షూట్ కోసం రెడీ అవుతోంది. చివరి దశలో ఉన్న చిత్రం ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న ‘విశ్వంభర’ కాగా, పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రం, ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడితో చేయబోతున్న ‘మెగా157’ చిత్రం. అనిల్ రావిపూడితో సినిమా షూటింగ్ మొదలైన ఒకటి రెండు నెలలలోనే మరో యంగ్ డైరెక్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాను అనౌన్స్ చేయనున్నారు. అలాగే ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ మరోసారి మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసేందుకు పవర్ ఫుల్ కథని సిద్ధం చేస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఎలా చూసినా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ రెండేసి సినిమాలతో బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారనేది.. ఈ ఆర్డర్ చూస్తుంటే తెలుస్తుంది. సరే.. ఇక విషయంలోకి వస్తే..
Also Read- Heroine: పెళ్లి చేసుకున్నా.. ఈ హీరోయిన్‌కి ఆ కోరిక చావలేదు.. బుల్లి బుల్లి నిక్కర్లలో!
తాజాగా ప్రారంభమైన అనిల్ రావిపూడితో మెగాస్టార్ చేయాల్సిన సినిమా ప్రకటన అనంతరం.. అంతా ఆ సినిమానే వార్తలలో ఉంటుంది తప్పితే.. ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా రావడం లేదు. మరీ ముఖ్యంగా సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందనే విషయం తెలిసిందే. సంక్రాంతి పోయి దాదాపు మూడు నెలలు అవుతుంది. అయినప్పటికీ ఈ సినిమా విడుదల విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ జరుగుతుందనేలా.. తాజాగా కమెడియన్ ప్రవీణ్ విడుదల చేసిన ఫొటో చూస్తుంటే తెలుస్తుంది. ‘విశ్వంభర’ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవితో ప్రవీణ్ ఫొటో దిగి, అది మీడియాకు విడుదల చేశాడు. దీంతో.. ఇంకా ‘విశ్వంభర’ షూటింగ్ జరుగుతూనే ఉందనేలా టాక్ మొదలైంది. ఇంకా షూటింగ్ జరుగుతూ ఉంటే, ఎప్పుడూ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తారు, ఎప్పుడు ప్రమోషన్స్ చేస్తారు. చూస్తుంటే, ఈ వేసవికి కూడా ఈ సినిమా విడుదల కష్టమే అనేలా.. చూస్తున్న పరిణామాలు అనిపిస్తున్నాయి.
Also Read- Single First Song: ఇద్దరు భామలతో.. రొమాంటిక్ మూడ్‌లో శ్రీ విష్ణు
మరోవైపు, నిజంగా ‘విశ్వంభర’ చివరి స్టేజ్‌లో ఉంటే.. ప్రమోషన్స్ మొదలు పెట్టవచ్చు. ఒక పోస్టరో, లేదంటే ఒక గ్లింప్సో ఏదో ఒకటి విడుదల చేసి.. అభిమానులను అలెర్ట్ చేయవచ్చు. టీమ్ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఈ విషయంలో, ఇటీవల ఘన విజయం సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్స్ స్ట్రాటజీని ఫాలో అయితే బాగుండు అనేలా మెగాభిమానులు కూడా చిత్రబృందానికి సూచనలు చేస్తున్నారు. అంతేకాదు, అలా పూజా కార్యక్రమాలు జరుపుకుందో, లేదో.. వెంటనే టెక్నీషీయన్స్‌ని పరిచయం చేస్తూ ‘మెగా157’కి సంబంధించి అనిల్ రావిపూడి విడుదల చేసిన వీడియో అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఇది కదా కావాల్సింది. సినిమా ప్రారంభం నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టి మరోసారి అనిల్ తన తడాఖా చూపించాడనేలా, ఆయనని కొనియాడుతున్నారు. అనిల్ రావిపూడి మాయతో ‘విశ్వంభర’ సైడ్‌కి వెళ్లిపోయిందంటే, అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి.. ఇకనైనా ‘విశ్వంభర’ మేకర్స్ మేల్కొని.. ప్రమోషన్స్‌పై దృష్టి పెడితే బాగుంటుందని మెగాభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు