Vijay Deverakonda: ఎవరు ఏమనుకున్నా ప్రస్తుతం బాలీవుడ్ కష్టాల్లో ఉందనే మాట వాస్తవమే. అలా అనీ, బాలీవుడ్‌పై ఎలా పడితే అలా మాట్లాడే ముందు కాస్త మన ట్రాక్ రికార్డ్ కూడా ఆలోచించుకోవాలి. బాలీవుడ్‌ని బాలీవుడ్ దర్శకులు కాకుండా.. అంటే ముంబైకి చెందిన వారు కాకుండా బయట నుంచి వచ్చిన వారే కాపాడతారంటూ తాజాగా రౌడీ స్టార్ విజయ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీనిపై పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. వాస్తవానికి బాలీవుడ్‌లో చక్రం తిప్పాలని భారీ ప్లాన్‌తో వెళ్లిన విజయ్ దేవరకొండ, అలాగే ఆయన చెబుతున్న బయట డైరెక్టర్ పూరీ జగన్నాధ్ భారీగా భంగపడ్డారు. ‘లైగర్’ అంటూ వారు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడమే కాకుండా.. మళ్లీ బాలీవుడ్ గురించి మాట్లాడకుండా చేసింది. అలాంటిది, ఇప్పుడు మళ్లీ బయటి వారే బాలీవుడ్‌ని కాపాడాలి అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడటంపై, బాలీవుడ్ ప్రేమికులు కొందరు ఫైర్ అవుతున్నారు. అసలింతకీ విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..
Also Read- Priyanka Chopra: మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. నిజమైతేనా?
తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ప్రస్తావన వచ్చింది. దీనిపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం లోటు కనబడుతుంది. త్వరలోనే ఆ లోటు తీరుతుంది. ఆ ఇండస్ట్రీని నిలబెట్టేందుకు త్వరలోనే కొత్త దర్శకులు వస్తారు. మళ్లీ హిందీ చిత్ర పరిశ్రమ నిలదొక్కుకుంటుంది. అయితే ఆ ఇండస్ట్రీని నిలబెట్టేది మాత్రం ముంబై నుంచి వచ్చే డైరెక్టర్స్ మాత్రం కాదు.. బయటి నుంచి వచ్చిన వారే ఆ ఇండస్ట్రీని మళ్లీ లైన్‌లోకి తీసుకువస్తారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల చూపు సౌత్ సినిమా ఇండస్ట్రీపైనే ఉంది. ఒకప్పుడు సౌత్ సినిమాలను చాలా హీనంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సౌత్ సినీ ఇండస్ట్రీకి దేశవిదేశాల్లో పేరును తెచ్చుకుంటుంది. అయితే ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుందని నేను చెప్పలేను. ఒక సర్కిల్‌గా మారుతూ ఉంటుంది. మరో ఐదారేళ్లలో మళ్లీ బాలీవుడ్ పరిస్థితులు మారవచ్చని ఈ రౌడీ చెప్పుకొచ్చారు.
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’పై ఈ వార్తలేంటి? అంతా అనిల్ రావిపూడి మాయ!
బాహుబలిపై సంచలన వ్యాఖ్యలు
హిందీ చిత్ర పరిశ్రమ గురించే కాదు.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిపై కూడా విజయ్ దేవరకొండ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ బాగా లో లో ఉన్న సమయంలో రాజమౌళి ధైర్యంగా ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఆయన దాదాపు 5 సంవత్సరాలు వర్క్ చేశారు. ఆ సినిమా వర్కవుట్ అయింది కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే నిర్మాతలతో పాటు ఎందరో కెరియర్స్‌పై దెబ్బపడేది. ఆ సినిమా కోసం పడిన శ్రమ వృధా కాలేదు. నేను చెప్పేది ఏంటంటే.. పోటీ పడాలి. ప్రతి ఇండస్ట్రీలో పోటీతత్వం ఉంటే మంచి సినిమాలు వచ్చాయి. తద్వారా ఇండస్ట్రీలు కూడా బాగుంటాయి. అలాంటి పోటీతత్వంపై బాలీవుడ్ దృష్టి పెడితే.. త్వరలోనే మళ్లీ తన స్థానాన్ని పొందుతుందని భావిస్తున్నాను.. అని విజయ్ దేవరకొండ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు కూడా గుర్రుగా ఉన్నారు. బాహుబలి సినిమా లేకపోతే ప్రభాస్‌కు కెరియరే లేదన్నట్లుగా విజయ్ అన్నాడనేలా వారు ఫైర్ అవుతున్నారు. చూద్దాం.. ఈ కాంట్రవర్సీ ఎంత వరకు వెళుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు