CCTV cameras (imagecredit:swetcha)
మహబూబ్ నగర్

CCTV cameras: నేరం జరిగితే తప్ప సీసీ కెమెరాలు పట్టించుకోరా.. ఎస్పీ విజయ్ కుమార్

గద్వాల స్వేచ్ఛ: CCTV cameras: జోగులాంబ గద్వాల జిల్లాలో సీసీ కెమెరాలు పనిచేయక సంవత్సరం దాటినా అధికారులు పట్టించుకోవడం లేదు. పలు కేసులను ఛేదించడానికి పోలీసులు ప్రైవేట్ సీసీ కెమెరాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఏర్పాటు అనంతరం విధులు నిర్వహించిన ఎస్పీ విజయ్ కుమార్ సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాలు, మున్సిపల్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేశారు.

అందులో భాగంగా మున్సిపల్ పరిధిలో ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా గత సంవత్సరం నుంచి ఆ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. తరచుగా మున్సిపల్ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట చోరీలు, ఇతర ఘటనలు జరుగుతుంటే వాటిని చేదించడానికి పోలీసులకు సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర వహించేవి. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమంటూ చెప్పే అధికారులు సీసీ కెమెరాలపై దృష్టి సారించడం లేదు.

పోలీసులు,మున్సిపల్ అధికారుల ప్రేక్షక పాత్ర

సీసీ కెమెరాల ఏర్పాట్లు, మరమ్మతుల విషయంలో పోలీసులు, ము: న్సిపల్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. నేరాలు జరిగినప్పుడు కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచుతామని పోలీసులు ప్రకటిస్తున్నారే తప్ప ఆ దిశగా ఆచరణకు నోచుకోవడం లేదు.చాలా గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్న పోలీసులు జిల్లా కేంద్రమైన గద్వాలలో సీసీ కెమెరాలు సరిగా ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటుచేసిన చోట వాటి నిర్వహణ బాధ్యతను తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

గద్వాల మున్సిపల్ పరిదిలో ఇటీవల చోరీలు చైన్ స్నాచింగ్, అర్ధరాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. ప్రజలకు సీసీ కెమెరాల పట్ల అవగాహన కల్పించి మున్సిపల్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నందు సాక్షాత్తు డిఎస్పీ ఆఫీస్ ముందు రెండు కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదు. ఎమ్మార్వో ఆఫీస్, పాత బస్టాండ్, కృష్ణవేణి చౌక్, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ కూడలలో, గాంధీ చౌక్, కిష్టారెడ్డి బంగ్లా తోపాటు కాలనీలలోకి వెళ్లే ప్రధాన కూడలలో సీసీ కెమెరాలను సంబంధిత డిపార్ట్మెంట్, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేశారు.

వాటిని అనుసంధానం చేస్తూ పోలీస్ స్టేషన్ లో పర్యవేక్షణ ఉండేది.ప్రస్తుతం వాటి నిర్వహణ లేకపోవడంతో పనిచేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 570 సీసీ కెమెరాలు ఉండగా ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారుల వద్ద ఉన్న సీసీ కెమెరాలు వర్కింగ్ లో ఉన్నాయి. ఐజలో ప్రధాన కూడలిలో రెండు కెమెరాలు పనిచేయడం లేదు. శాంతినగర్ లో అంబేద్కర్ చౌక్ దగ్గర ఉన్న ప్రధాన కూడలిలో సీసీ కెమెరా పనిచేస్తుండగా రాజోలి ఇతర మండలాలలు, ప్రధాన పంచాయతీ గ్రామాలలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి.

Also Read: LB Nagar Crime: ఫ్రెండ్ బిడ్డపైనే కన్నేశాడు.. పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

దీంతో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, మొబైల్ చోరీ, దొంగతనం జరిగిన లేదా ఎవరైనా తప్పిపోయిన కేసులను చేదించేందుకు, సిగ్నల్ జంప్, త్రిబుల్ రైడింగ్ దారులపై నిఘా పెట్టేందుకు సిసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కానీ ప్రస్తుతం సీసీ కెమెరాలు పనిచేయక పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో సత్వరమే పలు కేసులను చేదించడానికి ప్రైవేటు సీసీ కెమెరాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గతంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు కొన్నిచోట్ల వైర్లు తెగిపోవడం, ఈదురు గాలులకు సైడ్ కు జరగడం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి మెరుగైన వైర్ లెస్ కెమెరాలను ఉపయోగిస్తే రిపేర్ల సమస్య తొలగిపోతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఉన్న కెమెరాల నిర్వహణకు నిధులు కేటాయించి రిపేర్ చేయించి వాటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి:ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి.

జిల్లాలో పని చేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలి. లేదా కొత్త వాటిని ఏర్పాటుచేయాలి. అపార్ట్మెంట్లు, షాపుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్న పోలీసులు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా పట్టించుకోవడం లేదు. తక్షణమే సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు స్పందించి నేరాలను అదుపులోకి తీసుకురావాలి.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!