Sunrisers Hyderabad Beat Punjab Kings By 2 Runs Victory
స్పోర్ట్స్

IPL 2024 : పంజాబ్‌పై సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ విక్టరీ

Sunrisers Hyderabad Beat Punjab Kings By 2 Runs Victory: ఐపీఎల్‌లో మరో సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ ఆవిష్కృతమైంది. ఆద్యంతం ఉత్కంఠబరితంగా కొనసాగింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా తలపడ్డాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ రెండు పరుగుల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది.

ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా, అశుతోష్ శర్మ రెండు సిక్స్‌లతో రెచ్చిపోయి అక్కడున్నటువంటి పరిస్థితిని మార్చేశాడు. దానికి తోడు ఉనద్కట్ వైడ్‌లు వేయడంతో పంజాబ్ గెలుస్తుందేమో అనిపించింది. అయితే.. చివరి ఓవర్లో ఉనద్కర్ కొన్ని స్లో డెలివరీలు వేయగా, వాటిని బౌండరీ దాటించడంలో పంజాబ్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఎందుకంటే చివరి రెండు బంతుల్లో 11 పరుగులు కొట్టాల్సిన పరిస్థితిలోనూ ఉనద్కర్ ఓ వైడ్ బాల్ వేసి సన్ రైజర్స్ శిబిరంలో కంగారు పుట్టించాడు.

Also Read: ధోనీ, గంభీర్ అలాయ్, భలాయ్‌, నెట్టింట ఫోటోస్‌ వైరల్‌

అయితే ఆ తర్వాతి బంతికి సింగిల్ రావడంతో చివరి బంతికి 9 పరుగులు కొట్టాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని శశాంక్ సింగ్ సిక్స్ కొట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు సన్ రైజర్స్ గట్టెక్కింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్‌లో రాణించడంతో హైదరాబాద్‌ జట్టు మంచి స్కోర్‌ని చేయగలిగింది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?