Gautam Gambhir Hug Dhoni After Lost Of Kkr Video Goes Viral: ఐపీఎల్ 2024 సీజన్‌లో గౌతమ్ గంభీర్ మెంటార్‌షిప్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చెన్నైతో తలపడింది. దీంతో కేకేఆర్ జట్టు మొదటి ఓటమిని ఎదుర్కోవలసి పరిస్థితి నెలకొంది. అంతకుముందు కేకేఆర్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి చెన్నై చేరుకుంది. అయితే, గంభీర్ ఆటగాళ్లు ధోనీ సేన ముందు లొంగిపోవాల్సి వచ్చింది.ఈ సీజన్‌లో, గౌతమ్ గంభీర్ మెంటార్‌షిప్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చెన్నైతో తలపడింది. దీంతో కేకేఆర్ జట్టు మొదటి ఓటమిని ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు కేకేఆర్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి చెన్నై చేరుకుంది. అయితే, గంభీర్ ఆటగాళ్లు ధోనీ సేన ముందు లొంగిపోవాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్ చాలా ఉత్సాహంగా కనిపించి ధోనీని కౌగిలించుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల భేటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ ఐపీఎల్‌లో 138 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్‌ను సులువుగా ఓడించింది. ఈ సమయంలో, ఫీల్డ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ ఆటగాళ్లతో ధోనీ కరచాలనం చేశాడు. ఆ తర్వాత గంభీర్ వచ్చి ధోనీతో కరచాలనం చేయడంతోపాటు అతడిని కౌగిలించుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ భేటీకి సంబంధించిన వీడియో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా 2011 ఐసీసీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: సెన్సేషనల్ రికార్డ్, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్‌గా..!
గౌతమ్ గంభీర్ అదే టీమ్ ఇండియాకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. ప్రపంచకప్ 2011 ఫైనల్ మ్యాచ్‌లో గంభీర్ 97 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ధోనీ 91 పరుగులతో భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విధంగా, ఫైనల్ మ్యాచ్‌లో గంభీర్, ధోనీ ముఖ్యమైన సపోర్ట్‌ని అందించారు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు, అతను ధోని గురించి చెప్పుకొచ్చాడు. ఎంఎస్ ధోని వ్యూహాత్మకంగా చాలా మంచివాడు. అతనికి వ్యూహాత్మక మనస్తత్వం ఉంది. ఆటను ఎలా నియంత్రించాలో అతనికి తెలుసు. ధోనీ భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అతను బహుశా భారత్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ అంటూ కితాబిచ్చాడు. ఇంకేముంది ఇద్దరు ఒక్కటయ్యారు అంటూ ఇరువురి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడమే కాకుండా సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది.
View this post on Instagram