Alekhya Chitti Pickles: ప్రస్తుతం, ఏ సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్ చూసిన అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు బాగా వినబడుతోంది. మీ పచ్చడి రేట్లు ఏంటి మరి ఇంత ఎక్కువగా ఉన్నాయని నార్మల్ గా అడిగినందుకు.. కస్టమర్లు అని చూడకుండా.. పికిల్స్ యజమాని అలేఖ్య బూతులతో పిచ్చిగా పిచ్చిగా తిట్టేసింది. పచ్చళ్లు గురించి కాకుండా .. వాట్సాప్ లో అసభ్యపదాలు మాట్లాడుతూ మెసేజ్ లు పంపింది. ఇవి వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం మారు మోగింది. రేటు గురించి అడిగితే వాటి గురించి మాట్లాడాలి కానీ, బూతులు ఎలా తిడతారంటూ ఆమెపై అందరూ మండిపడ్డారు.
రెండు రోజులు అలేఖ్య సిస్టర్స్ కాంటాక్ట్ లో కూడా లేకుండా పోయారు. అయితే, అలేఖ్య చెల్లి రమ్య గోపాల్ కంచెర్ల దీనిపైనా క్లారిటీ ఇచ్చింది. ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు. అయిన కూడా ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఇక మీమ్స్ లో అయితే.. తెగ ఆడేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నిన్న చెల్లి .. ఈ రోజు అక్క సారీ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ” నా పేరు అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను .. నేను తప్పు చేశాను.. ఎవరినైతే ఇప్పటి వరకు తిట్టానో వాళ్లందరినీ క్షమించమని అడుగుతున్నాను ” వీడియో రిలీజ్ చేశారు. మనం ఇప్పటి వరకు ఎన్నో వివాదాలను చూశాము. బాబోయ్ ఇలాంటి దాన్ని మొదటి సారి చూస్తున్నాం. సారీ చెప్పిన కూడా వారిని వదలడం లేదు. సంబంధం లేని వాటిలో కూడా వారిని లాగుతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇంకొందరైతే ఎలా అయిన రిచ్ అయి, డబ్బులు బాగా సంపాదించి అలేఖ్య చిట్టి పికిల్స్ కొనాలంటూ పోస్టులు పెడుతున్నారు.