Sangareddy district: చెరువులో నీట మునిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామ శివారులో గల భీముని చెరువులో శుక్రవారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం వీరభద్రపల్లికి చెందిన ప్రేమ్ కుమార్ (35) హత్నూర మండలం బోర్పట్లలో జరుగుతున్న మల్లిఖార్జున స్వామి జాతర ఉత్సవాల్లో పాల్గొనేందుకు తన బంధువైన డప్పు నవీన్ కుమార్(25) ఇంటికి కుటుంబ సమేతంగా వచ్చారు.
అయితే ప్రేమ్ కుమార్,నవీన్ కుమార్ ఇద్దరూ స్నానం చేసేందుకు గాను గ్రామ సమీపంలోని భీముని చెరువు వద్దకు వెళ్ళారు.చెరువులో దిగి స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ప్రేమ్ కుమార్ నీట మునిగి పోతుండగా నవీన్ అతడిని కాపాడేందుకు వెళ్లి ఇద్దరూ నీటి మునిగి గల్లంతయ్యారు.ఇంటి నుండి వెళ్లి ఎంత సేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా గట్టు మీద వారి దుస్తులు కనిపించాయి.చెరువులో నీట మునిగి పోయారని నిర్ధారణకు బాధిత కుటుంబీకులు బోరున విలపించారు.
Also Read; Cyber Criminals Fraud: ఒకే ఒక్క కాల్.. రూ. 40 లక్షలు హాంఫట్.. ఆ తర్వాత?
విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ఫర్హీన్ షేక్,ఎస్ఐ సుభాష్,సిఐ నయీమొద్దీన్ లు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.చీకటి పడే దాకా మృతదేల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించారు అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు.చీకటి పడినందున గాలింపు చర్యలు శనివారం ఉదయం చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు