వరంగల్ స్వేచ్ఛ: Commissioner Sunpreet Singh: గంజాయి కేసుల్లో రవాణాకు పాల్పడే వ్యక్తులను మాత్రమే కాకుండా గంజాయిని అందించేవారితో పాటు దానిని స్వీకరించే వ్యక్తులను గుర్తించి గంజాయి మూలలను గురించి నిందితులను అరెస్టు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు పిలుపు నిచ్చారు. ఫిబ్రవరి నెల సంబంధించి నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించారు.
వరంగల్ కమిషనరేట్ చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్ లో వున్న కేసులను సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కేసుల పరిష్కారం కోసం అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
Also Read: Black magic: పాఠశాలలో క్షుద్రపూజలు.. వణికిపోతున్న విద్యార్థులు.. టార్గెట్ ఎవరు?
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్ పిలిపించడం కాకుండా, అధికారులు రౌడీ షీటర్లను వ్యక్తిగతం కలుసుకోవడం లేదా పరిసరాల్లో వుండే వారి నుండి రౌడీ షీటర్ ప్రస్తుత స్థితిగతులను అరా తీయాలని, ఆస్తి నేరాలకు సంబంధించి అధికారులు జైలు నుండి విడుదలయ్యే నిందితుల సమాచారాన్ని సేకరించాలని, ఈ ఆస్తి నేరాల్లో పోలీస్ హట్ స్పాట్‌లుగా గుర్తించి, అధికంగా నేరాలు జరిగే ప్రాంతాల్లో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు ముమ్మరంగా నిర్వహించడంతో పాటు, ట్రై సిటి పరిధిలో ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్ అధికారులు సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహించాలన్నారు.
పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ తప్పనిసరిగా కేసులను నమోదు చేయాలని, ప్రధానంగా ప్రజావాణి నుండి ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిసిపిలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, జనగాం ఏఎస్పీ చైతన్య, ఏ.ఎస్పీ మనాన్‌భట్, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/