Black magic: ఆర్ధిక కష్టాల నుంచి బయటపడాలని కొందరు భూత వైద్యుల దగ్గరకు వెళ్తారు. ఇంకొందరు ఒక్క రాత్రిలోనే ధనవంతులైపోవాలని క్షుద్ర పూజలు చేస్తుంటారు. మనతో గొడవ పడే వాళ్ళ మీద ఎలా అయిన పగ తీర్చుకోవాలని మరికొందరు చేతబడి చేస్తుంటారు. ఇలాంటివి ఎవరికి లాభం ఉంటుందో తెలీదు కానీ, చేతబడులు ,క్షుద్ర పూజలు ఎక్కువయ్యాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా, సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఓ ఘటన అందర్ని షాక్ కి గురి చేసింది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: SC on Kancha Gachibowli: హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్.. పనులపై స్టే విధింపు
సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కుసుమ రామయ్య పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు సంచలనం రేపాయి. పిల్లలు చదుకునే పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు కూడా షాకయ్యారు. వేకువజామున పాఠశాల ఆవరణలో మేకపిల్లను బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. మేకపిల్ల కోసం రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం ఉదయం ఐదు గంటలకు గేటు తెరిచి ఉంచినట్లు గుర్తించారు. విషయం బయటపడటంతో వెంకటేశం అక్కడి నుంచి పారిపోయాడు.
Also Read: AP Rains: ఏపీ వర్షాలపై లేటెస్ట్ అప్ డేట్.. ఆ జిల్లాలలో ఉరుములు.. మెరుపులే.. తస్మాత్ జాగ్రత్త
బలిపూజపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించగా, పాఠశాల వాస్తు సరిగా లేదని, అందుకే ఇలా చేశామని ముఖం చాటేస్తూ వెంకటేశం పరార్ అయ్యాడు. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారికి సమాచారం చేరవేయగా, ఆయన ఆదేశాలతో మండల విద్యాధికారి రఘుపతి సంఘటన స్థలానికి చేరుకొని పాఠశాల ప్రారంభం అనంతరం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.