GHMC on Hyderabad Rains (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC on Hyderabad Rains: వర్షాల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. మేయర్ విజయలక్ష్మీ

హైదరాబాద్ స్వేచ్చ: GHMC on Hyderabad Rains: నగరంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. నగరంలో గురువారం సాయంత్రం నుండి కురిసిన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సాయంత్రం అధిక వర్షపాతం నేపథ్యంలో మేయర్ జోనల్ కమిషనర్ల తో  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేసారు.

ఇంజనీరింగ్ మరియు IRT వాహనాలు అలర్ట్ చేసి, వాటిని రంగంలోకి దింపినట్లు తెలిపారు. కూలిన చెట్లను EV&DM బృందాలు తొలగిస్తున్నాయన్నారు. శేరిలింగంపల్లి జోన్ లో రైల్వే అండర్ బ్రిడ్జి వలన ట్రాఫిక్  జామ్ ఏర్పడుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ అధికారులను ఆదేశించారు. కూకట్ పల్లి జోన్ లో కూడా పలు లోతట్టు ప్రాంతాల్లో  నీరు నిలిచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మేయర్ జోనల్ కమిషనర్ ను ఆదేశించగా వెంటనే సంబంధిత శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు మేయర్ కు వివరించారు.

ఎల్ బి నగర్ జోన్ లో కూడా పిల్లలు వరదలో చిక్కుకుపోయినట్లు  ఫిర్యాదులు వస్తున్నాయని వెంటనే పిల్లలను కాపాడాలని మేయర్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో  ప్రజలు అత్యవసర మైతేనే బయటికి రావాలని, రోడ్డుపై నిలిచిన నీటిలో చిన్న పిల్లలు, వృద్ధులు వెళ్లకూడదని, మ్యాన్ హోల్స్ తెరవ వద్దని మేయర్ ప్రజలను కోరారు. అత్యవసరమైతే జిహెచ్ఎంసి కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించడానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో అక్కడే నీటి సంరక్షణ గుంటలను (Rainwater Harvesting Pits)ఏర్పాటు చేయాలని మేయర్ సూచించారు.

ఖైరతాబాద్ జోన్:  అన్ని నీరు నిలిచే ప్రాంతాలను వీడియో రికార్డ్ చేస్తున్నట్లు జోనల్ కమిషనర్ తెలిపారు. ఇదే సూచనను మిగతా జోన్లకు మేయర్ అందజేశారు.

కుకట్ పల్లి జోన్:  రైల్వేలకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో నీటి నిలువ సమస్యలున్నాయని, అయితే రైల్వే అధికారులతో సమన్వయం చేసి సమస్యను పరిష్కరించామని జోనల్ కమిషనర్   పేర్కొన్నారు.

చార్మినార్ జోన్: మలక్‌పేట్ వద్ద కొంత నీరు నిలిచినప్పటికీ, ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ స్థితికి వస్తోందని తెలిపారు.

ఎల్బీనగర్ జోన్: చంపాపేట్, సరూర్ నగర్ వద్ద సహజసిద్ధమైన భూస్థితి వల్ల కొంత నీటి నిల్వ ఏర్పడిందని, అయితే కొద్దిసేపటి తరువాత అది తగ్గిపోతుందని వివరించారు.

రక్షణ చర్యలు: మూసీ నది వద్ద ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోవడంతో, DRF బృందం రక్షణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి, త్వరలో పూర్తి స్థాయిలో పరిష్కారం అందించబడుతుందని అధికారులు తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!