Twist In Ameenpur case (image credit:Canva)
క్రైమ్

Twist In Ameenpur case: ప్రియుడితో వెళ్లాల్సింది.. పిల్లలను పొట్టనబెట్టుకుంది.. అమీన్ పూర్ ఘటనపై భర్త చెన్నయ్య

Twist In Ameenpur case: రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన అమీన్ పూర్ ముగ్గురు చిన్నారుల హత్యపై అసలు విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన తల్లిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఆ ముగ్గురు చిన్నారుల తండ్రి చెన్నయ్య చెప్పే మాటలు వింటే, కన్నీళ్లు రాలాల్సిందే.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో రజిత అనే మహిళ ఇటీవల తన పిల్లలకు పెరుగన్నం తినిపించి మరీ, రుమాలుతో మెడకు గట్టిగా బిగించి హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. అమీన్ పూర్ లోని రాఘవేంద్ర కాలనీకి చెందిన చెన్నయ్య, రజిత దంపతులకు ముగ్గురు చిన్నారులు సంతానం కాగా, ఇటీవల పెరుగన్నం తిన్న తర్వాత ఆ చిన్నారులు చనిపోయినట్లు, తల్లి రజిత చెప్పుకొచ్చింది.

అలాగే తనకు కూడా ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో భర్త చెన్నయ్య, పిల్లలతో పాటు భార్యను వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత పిల్లలు ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు అసలు నిజాన్ని బయటకు తీశారు.

పోలీసులు ముందుగా ఫుడ్ పాయిజన్ అని భావించారు. ఆ తర్వాత క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించారు. వాళ్ళు రాత్రి పెరుగన్నం తిన్నారని పోలీసులతో రజిత భర్త చెన్నయ్య చెప్పారు. చెన్నయ్య మాత్రం పప్పన్నం తిన్నాను అని చెప్పడంతో పోలీసుల అనుమానం పెరిగింది. కానీ పోలీసుల విచారణలో పిల్లల్ని తల్లే చంపినట్టు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలపై ఎలాంటి విషప్రయోగం జరగలేదని డాక్టర్లు నిర్దారించారు.

వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య చేసినట్టు తల్లి ఒప్పుకోవడంతో, పోలీసుల స్కెచ్ ఫలించింది. భర్త, భార్య మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటంతో రజిత తన పాత స్నేహితుడితో పరిచయం పెట్టుకుందని, అతడితో వివాహేతర సంబంధం కారణంగా పిల్లల్ని అడ్డు తొలగించాలని అనుకుని హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగురు పిల్లల్ని టవల్ తో కలిసి చంపేసినట్లు, ప్రియుడు శివ కుమార్ తో కలిసి ఉండాలని రజిత హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

తన ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్న రజిత భర్త చెన్నయ్య ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుండి కోలుకుంటున్నారు. చెన్నయ్య సొంత గ్రామం తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామం కాగా తన ఆవేదన గ్రామస్థులతో పంచుకున్నారు. తనను నమ్మించి భార్య గొంతు కోసిందని, ప్రాణానికి సమానమైన పిల్లల్ని అతి కిరాతకంగా హత్య చేసిందని బాధ వెళ్ళగక్కారు. ఏడుద్దామంటే కంట్లో నుండి నీళ్లు రావడం లేదు.. నాతో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పకుండా ఇష్టం ఉన్న వాడితో వెళ్ళిపోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పదవ తరగతి గెట్ టు గెదర్ పార్టీ పేరుతో నట్టేట ముంచిందని, పిల్లలకి విషమిచ్చి తను యాక్టింగ్ చేసి తప్పించుకోవాలని చూసిందన్నారు. తిరిగి మళ్లీ పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి చంపేసిందని, ఇదంతా ఆస్తి కోసమే చేసిందన్నారు. బహిరంగంగా తన భార్యను దీనికి కారణమైన శివను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. క్షణక్షణం తనకు తన పిల్లలే గుర్తొస్తున్నారని, తాను చచ్చిపోయి ఉన్నా బాగుండేదని, బతికి క్షణక్షణం చస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: BRS vs Congress: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. నీటి విడుదలపై రాజకీయ రగడ.. వివాదం ఎందుకంటే?

ఇక ఈ ఘటనపై మెదక్ పల్లి గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తల్లి వల్ల మా ఊరికి చెడ్డ పేరు వచ్చిందని, అలాంటి సంస్కారం లేని మహిళను బహిరంగంగా ఉరితీయాలని గ్రామస్తులు అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా, చాలామందికి పిల్లలు లేక మనోవేదనకు గురి అవుతున్నారని, ఇలాంటి వారి వల్ల సమాజంలో మహిళలు తలెత్తుకోలేరన్నారు. ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు వేసి మరెవరు ఇలా చేయకుండా చూడాలని వారు కోరారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు