BRS vs Congress: లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండి) నీటి తరలింపు పై రాజకీయ రగడ నెలకొంది. ప్రభుత్వ విధానాల కారణంగా నీటి ఎద్దడి మొదలైందని, బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడే బూస్టర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడాన్ని తప్పుపడుతూ మరో మూడు నెలలు ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ప్రజలు త్రాగునీరు లేక అల్లాడిపోతారని రాజకీయ విమర్శలు చేస్తుంది. వెంటనే కిందికి నీటిని విడుదల ఆపకపోతే తామే నీటిని ఆపివేస్తామని బిఆర్ఎస్ అంటుంది. పంటలను కాపాడుకోవడానికి నీటి విడుదల చేస్తున్నామని, నీటి ఎద్దడి లేదని కాంగ్రెస్ చెబుతుంది. మొత్తానికి ఎల్ ఎండి చుట్టు రాజకీయ విమర్శలు పెరిగిపోయాయి.
కరీంనగర్ జిల్లా కేంద్రం సమీపంలో లోయర్ మానేరు డ్యామ్ ఉంది.ఈ డ్యామ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ప్రజల త్రాగు నీటి అవసరాలతో పాటు సాగు నీటిని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కెపాటిసి 24 టిఎమ్ సి లు కాగా ప్రస్తుతం.. 5.812 టిఎంసి ల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నుంచీ దిగువకు 2779 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 6 వరకు ఈ నీటిని విడుదల చేయనున్నారు.
Also read: TG Cabinet Expansion: మంత్రి వర్గ విస్తరణపై వీడని సస్పెన్స్.. ఈ కారణాలే ఆటంకంగా మారాయా?
కరీంనగర్ లో నీటి అవసరాలే కాకుండా ఇతర జిల్లాలకు కూడా నీటి అవసరాలను ఈ ప్రాజెక్ట్ తీరుస్తుంది.ఈ ప్రాజెక్ట్ లో పూడిక ఎక్కువగా ఉండటంతో ఇప్పుడే బూస్టర్లు ఆన్ చేసి నీటిని సరఫరా చేస్తే వేసవి కాలం పూర్తి అయ్యే వరకు నీరు నిల్వ ఉండదని కనీసం పది టిఎంసిలు నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్, ప్రభుత్వాన్ని కోరుతుంది ఎస్ఆర్ఎస్పి తో పాటు మిడ్ మానేరులో కూడా నీటి నిల్వలు తగ్గుతున్నాయి. మరో పది రోజుల్లో ఎల్ఎండి డెడ్ స్టోరేజ్ కి వెళ్తాయని బిఆర్ఎస్ వాదిస్తోంది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మేల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ లోయర్ మానేరు డ్యామ్ ను సందర్శించారు. ఈ వారం రోజుల్లో దిగువకు నీటిని విడుదల ఆపకపోతే తామే అడ్డుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా కరువు వచ్చిందని ఆరోపించారు. ఇప్పటికే పంటలు ఎండిపోయాయి, కనీసం తాగు నీరు కూడా అందించే స్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతిది రాజకీయం చేయడం బిఆర్ఎస్ కి అలవాటుగా మారిందన్నారు. తాగు నీటి సమస్య ఉండదని, జూలై వరకు కూడా డ్యామ్ డెడ్ స్టోరేజ్ కి చేరుకోదని స్పష్టం చేశారు.
Also read: Asifabad District: చీకట్లో మాటు వేసిన ఏసీబీ.. ఆ చెక్ పోస్ట్ వద్ద సినిమా రేంజ్ సీన్స్..
ప్రజలను తప్పుదారి పట్టించి, రాజకీయాలు చేయడం బిఆర్ఎస్ అలవాటు అని విమర్శలు చేశారు. అయితే ఈసారి ఎండ తీవ్రత కారణంగా నీటి ఎక్కువగా ఆవిరై తాగు నీటి సమస్య వస్తుందని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.అయితే పై నుంచి నీటి విడుదల చేసి ఎల్ఎమ్ఎడిలో నింపాలని బిఆర్ఎస్ కోరుతుంది.
నీటి ఎద్దడి వస్తే.. ఉద్యమాన్ని ఉదృత్తం చేస్తమని హెచ్చరించింది. మొత్తానికి ఈ రెండు పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సమస్య లేదని, ప్రభుత్వ విధానాలతో ఆ సమస్య వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే తమకు అన్ని విషయాలు తెలుసని, ప్రజలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది.