Russian Woman Jailed: భార్య భర్తల అనుబంధం ఈ సృష్టిలో చాలా గొప్పదని చెప్పవచ్చు. జీవిత భాగస్వామిలో ఒకరు తప్పు చేస్తే మరొకరు దానిని ఎత్తి చూపి మరోమారు అలా చేయకుండా సరిచేస్తుంటారు. అలాగే కష్టసుఖాలను పంచుకుంటూ జీవితాన్ని హాయిగా ఆస్వాదించేలా ముందుకు సాగుతుంటారు. కానీ ఓ భార్య ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. భర్తను మానవ మృగంలా మార్చింది. ఏకంగా ఓ అమాయకపు స్త్రీని రేప్ చేసి చంపేలా పురిగొల్పి తగిన శిక్ష అనుభవించింది.
అసలేం జరిగిదంటే?
రష్యన్ మహిళా ఓల్గా బైకొవ్స్కయా (Olga Bykovskaya).. స్త్రీ జాతికే కలంకం తెచ్చేలా ప్రవర్తించింది. తోటి మహిళను రేప్ చేసేలా భర్తను ప్రోత్సహించి ఎక్కడి లేని విమర్శలను మూటగట్టుకొంది. ఓల్గా బైకొవ్స్కయా భర్త.. రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధంలో భాగంగా అతడు 2022లో ఆ దేశానికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉక్రెయిన్ స్త్రీపై అతడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పట్లో పెద్ద ఎత్తున రష్యన్ బలగాలు.. తమ ఆడవారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నాయని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో ఓల్గా బైకొవ్స్కయా భర్త కూడా ఉండటం గమనార్హం.
పట్టించిన ఆడియో కాల్..
2022 ఏప్రిల్ లో భర్తతో మాట్లాడిన ఓల్గా బైకొవ్స్కయా.. ఏ భార్య ఇవ్వని సలహాను అతడికి ఇచ్చింది. ఓ ఉక్రెయిన్ మహిళను రేప్ చేయాలని ఆమె సూచించింది. ఇందుకు సంబంధించిన ఆడియోను సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ ఉక్రెయిన్ (SSR) బహిరంగంగా విడుదల చేసింది. దీంతో ఉక్రెయిన్ నగరమైన కీవ్ లోని షెవ్చెన్కివ్స్కీ జిల్లా కోర్టు (Shevchenkivskyi District Court) దీనిపై విచారణ చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెకు తాజాగా శిక్ష విధించింది.
ఐదేళ్ల జైలు శిక్ష
ఓల్గా బైకొవ్స్కయాకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ షెవ్చెన్కివ్స్కీ జిల్లా కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హత్య, విధ్వంసం, యుద్ధనేరం, విస్తృతమైన అరాచకాన్ని ప్రతిబింబించే సెక్షన్ల కింద ఆమెకు శిక్ష విధించింది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన ప్రముఖ న్యూస్ పేపర్ ప్రవడా వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఓ మహిళా చేయాల్సిన పనేనా ఇది అంటూ ఓల్గా బైకొవ్స్కయా విమర్శలు గుప్పిస్తున్నారు. తోటి స్త్రీని అత్యాచారం చేయమని చెప్పడానికి ఎలా మనసు వచ్చిందని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమెకు శిక్ష పడటం ముమ్మాటికీ సబబేనని పేర్కొంటున్నారు.
Also Read: To-let to YCP office: దుకాణం సర్దేసిన జగన్.. పార్టీ ఆఫీసుకి టూ లెట్ బోర్డ్.. హాలీడేస్ ప్రకటించారా?
రష్యన్ సైన్యం అకృత్యాలు
ఉక్రెయిన్ పై యుద్ధంలో భాగంగా ఆ దేశానికి వెళ్లిన రష్యన్ బలగాలు.. అక్కడి స్త్రీలపై పెద్ద ఎత్తున లైంగిక దాడికి పాల్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. యుద్ధం పీక్స్ లో ఉండగా పలు ఉక్రెయిన్ ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యన్ బలగాలు.. అక్కడి స్త్రీలను బంధించారు. ఈ సందర్భంగా వారిపై అత్యాచారాలు చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి.