To-let to YCP office: 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ పార్టీ (YSRCP).. 2024 ఎలక్షన్స్ కు వచ్చేసరికి పూర్తిగా ఢీలా పడిపోయింది. గతంలో 151 స్థానాలు కైవసం చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేతృత్వంలోని ఆ పార్టీ.. ఈసారి 11 స్థానాలకు పడిపోయి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో వై నాట్ 175 అంటూ పదే పదే చెబుతూ వచ్చిన జగన్ కు.. ఈ ఓటమి పెద్ద షాకే అని చెప్పాలి. ఎన్నికల ఫలితాల నుంచి ఆయన ఏపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీకి సైతం రెగ్యూలర్ గా హాజరుకావట్లేదు. దీంతో పవన్ (Pawan Kalyan), చంద్రబాబు (CM Chandrababu) ను ఫేస్ చేయలేకనే జగన్ ఇలా చేస్తున్నారంటూ రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ప్రధాన కార్యాలయానికి (YCP Head Office) టూ లెట్ బోర్డు కనిపించడం తీవ్ర చర్చకు దారి తీసింది.
తాడేపల్లి ఆఫీసుకి తాళాలు
ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – బీజేపీ భాగస్వామ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో వైసీపీ పార్టీలో ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలు వచ్చి చేరినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి టూ లెట్ బోర్డు (Tolet Board) కనిపించడం సర్వత్రా ఆసక్తిరేపుతోంది. తాడేపల్లి బైపాస్ లో ఉన్న వైసీపీ పార్టీని జగన్.. మూసివేసినట్లు తెలుస్తోంది. క్రీయాశీలకంగా వ్యవహరించనప్పుడు అద్దె కట్టడం ఎందుకని భావించి.. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు పార్టీ కార్యాలయాన్ని జగన్ క్యాంప్ ఆఫీసుకు షిఫ్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఖాళీ అందుకేనా?
ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం తర్వాత వైసీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు (YCP Ex Ministers) తలో దారి చూసుకుంటున్నారు. రెడ్ బుక్ (Red Book) భయంతో వారు బయట కూడా తిరగలేకపోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రభుత్వం ప్రతీకార కేసులు పెడుతోందంటూ నేతలతో పాటు కార్యక్రతలు సైతం బయటకు రావడం లేదు. దీంతో తాడేపల్లి ప్రధాన కార్యాలయం సహా.. ఏపీ వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఆఫీసులు పార్టీ శ్రేణులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో అద్దె దండగని భావించిన.. లోకల్ వైసీపీ లీడర్స్ పార్టీ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. వైసీపీ పార్టీల మూసివేతకు సంబంధించి.. ఇటీవల ఏపీలో పెద్ద ఎత్తున వార్తలే వచ్చాయి. ఈ క్రమంలోనే పార్టీకి కేంద్ర బిందువైన తాడేపల్లి ఆఫీసుకు సైతం టూ లెట్ బోర్డు పెట్టడం.. చర్చకు తావిస్తోంది.
Also Read: Telangana: నాడు డైవర్షన్.. నేడు పొలిటికల్ వర్షన్.. బీఆర్ఎస్ పై కేంద్రం ఫైర్..
వైసీపీకి సమ్మర్ హాలీడేస్?
మరోవైపు మాజీ సీఎం జగన్.. వైసీపీకి వేసవి సెలవులు ప్రకటించినట్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీ చేపట్టిన రైతు పోరు, విద్యుత్ చార్జీల పోరు, యువత (ఫీజు) పోరు వంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు జగన్ దూరంగా ఉండటంతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు సైతం హాజరుకాకపోవడంపై శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ఎందుకని జగన్ భావించారా? అన్న సందేహాన్ని పొలిటికల్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు సంక్రాంతి తర్వాత జిల్లాల టూర్ ఉంటుందని మాజీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. ప్రతీ నియోజకవర్గంలో మూడేసి రోజులు బస చేసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు. ఇప్పటివరకూ వాటి ఊసే లేకపోవడంతో వేసవి సెలవులు ప్రకటించినట్లేనని చర్చించుకుంటున్నారు.