Paritala Sunitha on Jagan(Image Credit: Twitter)
ఆంధ్రప్రదేశ్

Paritala Sunitha on Jagan: నా భర్త హత్యకు జగనే కారకుడు..? సునీత సంచలన కామెంట్స్

Paritala Sunitha on Jagan: తన భర్త పరిటాల రవి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య జరిగిన రోజు సీబీఐ జగన్‌ను కూడా విచారించిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. టీవీ బాంబు గురించి మాట్లాడే వారు కారు బాంబు, సూట్‌కేస్ బాంబు గురించి కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు.

పరిటాల సునీత మాట్లాడుతూ.. తోపుదుర్తి సోదరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫ్యాక్షన్‌ను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఓబుల్ రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆమె విమర్శించారు. గంగుల భానుమతి, కనుముక్కల ఉమాకు విజ్ఞప్తి చేస్తూ ఫ్యాక్షన్ వల్ల తమ మూడు కుటుంబాలు భారీ నష్టాన్ని చవిచూశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలం పాటు ఈ గాయాల నుంచి కోలుకోవడానికి ప్రయత్నించామని ఆమె గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో తోపుదుర్తి సోదరులు మళ్లీ ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆమె ఫైర్ అయ్యరు. వారి మాటలు నమ్మి కుట్రలో భాగస్వాములు కావద్దని గంగుల భానుమతి, కనుముక్కల ఉమాను ఈ సందర్భంగా పరిటాల సునిత కోరారు.

Also Read: గట్టిగా నిలబడతా.. 2.0 ఏంటో చూపిస్తా.. జగన్ వార్నింగ్

పాపంపేటలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇళ్లు కూల్చివేసిన సంఘటనను సునీత ప్రస్తావించారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కూడా బాధితులను రెచ్చగొడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఇచ్చే కుటుంబం కానీ, తీసుకునేది కాదు అని ఆమె స్పష్టం చేశారు. ఎంపీపీ ఎన్నికల విషయంలో తాను జోక్యం చేసుకోలేదని ఆమె తెలిపారు. అలా చేసి ఉంటే రామగిరి ఎంపీపీ టీడీపీ వశం అయ్యేదని ఆమె పేర్కొన్నారు. వారి ఎంపీటీసీలపై నమ్మకం లేకనే క్యాంపులకు తరలించారని ఆమె విమర్శించారు.

తోపుదుర్తి చందు గతంలో చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు గుప్పించిన విషయాన్ని ప్రస్తావివించారు. ఇప్పుడు కేసుల భయంతో ‘గారు’ అని సంబోధిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ‘తోపుదుర్తి సోదరులు ఏది చెబితే అదే జగన్ మాట్లాడుతున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు వాస్తవాలు తెలియవా..?’ అని ఆమె ప్రశ్నించారు. జగన్‌కి శుక్రవారం బాగా కలిసి వచ్చినట్టుందని, అందుకే శుక్రవారం రోజు పాపిరెడ్డిపల్లికి వస్తానంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. సూట్‌కేసులో బట్టలు ఎక్కువగా తీసుకొని రావాలని, లింగమయ్యతో పాటు తమ పార్టీ బాధితులను కూడా పరామర్శించాలని ఆమె జగన్‌కు సూచించారు.

Also Read: దుకాణం సర్దేసిన జగన్.. పార్టీ ఆఫీసుకి టూ లెట్ బోర్డ్.. హాలీడేస్ ప్రకటించారా?

తోపుదుర్తి బ్రదర్స్ వల్ల గత ఐదేళ్లలో జగన్ పార్టీలో చాలామంది నష్టపోయారని, వారిని కూడా పరామర్శిస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో జగన్ వచ్చి ఫ్యాక్షన్‌ను రగిలించవద్దని ఆమె హెచ్చరించారు. ఈ ఆరోపణలు, విమర్శలతో పరిటాల సునీత మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!