మహబూబాబాద్ క్రైమ్ స్వేచ్ఛ: Mahabubabad Crime: ప్రభుత్వ ఉద్యోగిని అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి గుర్తుతెలియని దుండగలు హత్య చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనగపురం గ్రామ శివారు భజన తండా వ్యవసాయ పొలాల్లో సోమవారం రాత్రి ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో హత్యకు గల వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
ఘటన స్థలాన్ని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సందర్శించి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడానికి ప్రత్యేక అధికారిగా మహబూబాబాద్ డిఎస్పి ఎన్.తిరుపతిరావు నియమించారు.
భద్రాచలం ప్రాంతానికి చెందిన ఉద్యోగి హత్యపై అనుమానాలు
భద్రాచలం ప్రాంతానికి చెందిన టి.పార్థసారథి(42) గత ఏడాది క్రితం రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగాల్లో ఆయనకు అవకాశం దక్కింది. అప్పటినుంచి దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్లో హెల్త్ సూపర్వైజర్ గా పని చేస్తున్నారు. స్వస్థలం భద్రాచలం నుంచి దంతాలపల్లి లోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు డ్యూటీ నిమిత్తం సెలవులను పూర్తి చేసుకొని సోమవారం సాయంత్రం దంతాలపల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
పార్థసారథి భద్రాచలం తన ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి భార్య పార్థసారథి ఉంటున్న ఇంటి ఓనర్ కు ఫోన్ చేసి వచ్చారా..? అని తెలుసుకుంటున్నారు. అలా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఒకసారి, మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో మరొకసారి ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఇదే విషయమై పార్థసారథి సోమవారం సాయంత్రం 6:30 గంటలకు ఇంటి ఓనర్ కు ఫోన్ చేసి వస్తున్నట్లు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలోనే పార్థసారధి అక్క పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కోణంలోనే పూర్తిస్థాయి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు.
బృందాలుగా పోలీసులు… వేగవంతంగా విచారణ
హిందువుల పర్వదినం ఉగాది, ఆ మరుసటి రోజే ముస్లింల పర్వదినం రంజాన్ వేడుకల్లో నిమగ్నమైన మానుకోట ప్రజలకు మంగళవారం ఉదయం చేదువార్త చేరింది. ప్రభుత్వ ఉద్యోగి పార్థసారథి హత్య ఒక్కసారిగా మంగళవారం ఉదయం మహబూబాబాద్ ప్రజల్లో కలకలం రేకెత్తించింది. ప్రశాంతంగా ముగించిన వేడుకల అనంతరం సరిహద్దు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి హత్య అందరిని ఆందోళనకు గురిచేసింది.
Also Read: Pastor Praveen Death: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వీడని ఉత్కంఠ.. కొలిక్కి వచ్చేనా?
ఈ విషయంలోనే ఘటన స్థలానికి భారీగా మోహరించిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ ను వేగవంతం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన అనుమానాలను పరిగణలోకి తీసుకొని ఆ దిశగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఇద్దరికీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయనే కోణంలో విచారణ
ఉగాది, రంజాన్ పర్వదినాల పండుగల అనంతరం చోటుచేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి పార్థసారథి హత్య ఉదాంతంలో భార్య భర్తలు ఇరువురికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ డిఎస్పి ఎన్ తిరుపతిరావు నేతృత్వంలో ప్రత్యేక ఆరు బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపడుతున్నారు. మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తరపు బంధువులు, భార్య ఇచ్చిన ఆధారాలతోనే దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తుంది.
హత్యకు గురైన పార్థసారథి బెట్టింగ్ లకు పాల్పడేవాడని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే తొలుత పార్థసారథి వేరే మహిళతో అక్రమ సంబంధం, విషయం తెలుసుకున్న తర్వాత భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం నేర్పుతున్నట్లు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాల ప్రకారం తెలుస్తోంది. కాగా, మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Also Read: Rooster Fight Organisers: కోడి పందాలు కలకలం.. ఆరుగురు అరెస్ట్.. ఎక్కడంటే?