నర్సంపేట స్వేచ్ఛ: Sudharshan on Adulterated Goods: నకిలీ ఆహార పదార్థాలను వినియోగదారులు కొనుగోలు చేసి మోసపోవద్దని జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా అధ్యక్షుడు గిరగా ని సుదర్శన్ గౌడ్ కోరారు. వరంగల్ జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కమిటీల ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి బుక్లెట్ తో నకిలీ కల్తీ పదార్థాలు, వస్తువులను కొని నష్టపోవద్దని, మోస పోవద్దని ప్రచారం చేస్తూ వరంగల్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులను కలిశారు.
నర్సంపేట లోని ఆర్టీవో ఉమారాణి కి బుక్ లెటర్ అందించారు. భారత దేశంలో ఉన్నటువంటి ఐఎస్ఐ, హాల్ మార్క్, ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఆగ్ మార్క్, మొదలైన ప్రభుత్వ ట్రేడ్ మార్కులు ఉన్న ఆహార పదార్థాలు, వస్తువులను మాత్రమే కొనడం గాని, అమ్మడం గాని, చేయాలని అన్నారు. ట్రైడ్ మార్కులు లేకుండా అమ్మడం, కొనడం చేయరాదని తెలిపారు.
అట్లా ట్రైడ్ మార్కులు లేని నకిలీ వస్తువులు ఎక్కడ కనిపించినా సంబంధిత అధికారులకు టోల్ ఫ్రీ నెంబర్లు, వాట్సాప్ నెంబర్లు 8800001915;1800114000 ;180042500333; 1915; డ్రగ్స్ కు 18005996969;ఆబ్కారీ కు 18004252523; ఆహార పదార్థాలు కల్తీ కి9868686868; 1800112100 మొదలయిన నెంబర్ల ద్వారా ఫిర్యాదులు చేయాలన్నారు. వీరిపై చర్యలు తీసుకునేటట్లు చేయాలని ఆన్ని ప్రభుత్వ శాఖ అధికారులను వినియోగదా రుల, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరారు.
Also Read: Rajiv Yuva Vikas Scheme: మంచి అవకాశం మించిన దొరకదు.. దరఖాస్తు చేసుకోండి.. జిల్లా కలెక్టర్
నర్సంపేట పట్టణంలో నూ ఆర్డిఓ, జిల్లా నీటిపారుదల శాఖ , ఐ సి డి ఎస్ , ఫైర్ స్టేషన్ మార్కెట్ సెక్రటరీ, తాసిల్దార్, పశుసంవర్ధక శాఖ అధికారి, సివిల్ సప్లై స్టాక్ పాయింట్లు, వ్యవసాయ శాఖ అధికారి, ఆప్కారి శాఖ అధికారి, ఆర్టీసీ డిఎం, ఎఫ్ ఆర్ ఓ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, చెన్నారావు పోలీస్ ఎస్సై, నర్సంపేట మున్సిపల్ కమిషనర్, వరంగల్ జిల్లా పౌర సరఫరాల అధికారి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్, ఎక్సైజ్ సూపర్ ఇండెంట్, ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్టర్ అధికారి మొదలైన అధికారులను వారి వారి కార్యాలయాల్లో వినియోగదారుల డీసీఐసీలు గిరగాని సుదర్శన్ గౌడ్, కే శ్రీనివాసరావు, బెజ్జెంకి ప్రభాకర్ , నా గిల్లి సారంగం,వెంకటాచారి, రాము మరియు హనుమకొండ జిల్లా డిసిఐసి ఠాకూర్ రతన్ సింగ్ మొదలైన వారు కలిసి ట్రేడ్ మార్కుల ప్రాధాన్యతను వివరించారు. బి ఐ ఎస్ వారి బుక్లెట్ ను అధికారులందరికీ అంద చేసినారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు