New Born Baby Dies(image credit:X)
నార్త్ తెలంగాణ

New Born Baby Dies: తీవ్ర విషాదం.. అప్పుడే పుట్టిన శిశువు మృతి.. బంధువుల రాస్తారోకో

మహబూబాబాద్ స్వేచ్ఛ: New Born Baby Dies: శనిగపురం శివారు బట్టు తండాలోని బానోతు జయశ్రీ , కుమార్ దంపతులకు జన్మించిన మగ బిడ్డ వైద్యులు, నర్సుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని, సేవాలాల్ సేన, ఎల్ హెచ్ పి ఎస్, బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రి ఎదుట రాస్తారోకో, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ శివారు శనగపురం బట్ట తండా బానోత్ కుమార్ భార్య జయశ్రీ కి సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో మహబూబాబాద్ లోని ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
ఇదే సమయంలో డ్యూటీ లో ఉన్నా డాక్టర్లు, నర్సులు నిర్లక్ష్యం వహించడం వల్ల నాలుగు గంటలు ఆలస్యం జరిగిందన్నారు. సిజేరియన్ చేయడం వల్ల అధిక రక్తస్రావమై పుట్టిన బాబు మృతి చెందాడని  ఆరోపించారు. ఈ ఘటన నిర్లక్ష్యం వల్లే జరిగిందని వెంటనే కలెక్టర్ స్పందించాలని, డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులను సస్పెండ్ చేసి గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ సేవాలాల్ వెంకన్న నాయక్, జాతీయ నాయకులు ధరావత్ మోతిలాల్ నాయక్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Also read: Bhadradri Thermal Power Plant: యమపాశంగా పవర్ ప్లాంట్.. గాలి, నీరు కలుషితం.. కారణం ఏంటంటే?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు