ఖమ్మం, స్వేచ్ఛ: Bhadradri Thermal Power Plant: తెలంగాణాలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి కొత్తగూడెం జిల్లా, మణుగూరులో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను 2015లో ప్రారంభించి 2020లో పూర్తిచేశారు. అప్పటి ప్రభుత్వం ఈ విద్యుత్ ప్లాంట్ లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజి వాడడంతో పదిహేనేళ్ల తర్వాత రావాల్సిన సమస్యలు ముందుగానే వస్తాయని నిపుణులు హెచ్చరించనా వినలేదు. ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల కాలుష్యం ఎక్కువగా విడుదల అవ్వడంతో పాటు, ఏడాదికి 350 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని పర్యావరణ వేత్తలు ప్రారంభంలో ఆందోళనలు కూడా చేశారు. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చి ప్రజల పాలిట యమపాశంగా మారాయి.
పవర్ ప్లాంట్ పరిసరలలో ఉండే వారు ప్లై యాష్ సమస్యను ఎదుర్కొంటున్నారు. పీల్చేగాలి, తాగే నీరు కలుషితం అవ్వడంతో ప్రజలు శ్వాస కోశ, మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలలో నుంచి వెలువడే వ్యర్థాలలో బూడిద ప్రధానమైనది. దేశంలో బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలలో ఏటా సుమారు 258 మిలియన్ మెట్రిక్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది.ఇందులో 78 శాతం బూడిదను సిమెంట్, సిరామిక్ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తుంటారు.మిగిలినది యాష్ పాండ్లలో మిగిలిపోతుంది. ఇది గాలి నీరు తో కలిసి వాటిని కలుషితం చేస్తోంది. దాని ప్రభావం జీవరాశులపై పడుతోంది.
Also read: CPM Leaders demand: వెల్నెస్ కేంద్రాల అక్రమ దందా.. సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు
భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో విడుదల అయిన యాష్ ను పవర్ ప్లాంట్ సిబ్బంది పక్కనే ఉన్న గోదావరిలో కలుపుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇలా యాష్ కలిపిన నీళ్లు గోదావరిలో కలపడం వలన ప్రజలు మిషన్ భగీరథ కింద వాటినే తాగి అనారోగ్య పాలవుతున్నారు. ఈ నీటిని తాగిన చేపలు మృత్యు వాత పడుతున్నాయని మత్స్య కారులు ఆందోళన వ్యక్తం చస్తున్నారు. ఈ నీటినే పంట పొలాలకు ఉపయోగించడం వలన దిగుబడి తగ్గిందని స్థానిక రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అలాంటి కలుషిత నీటితో పండించిన ఆకుకూరలు,కూరగాయలను తిన్న ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారలు ప్లైయాష్ ను గోదావరిలో కలుపకుండా సరిపడినన్ని యాష్ పాండ్ లు ఏర్పాటు చేసి బూడిద నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రం మేము గోదావరిలో కలపడం లేదని చెప్పడం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని సాంబాయిగూడెం, చిక్కుడు గుంట సరిహద్దుల్లో బొగ్గు రవాణా చేస్తున్న లారీలతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి ప్లాంట్ కు నిత్యం వందల సంఖ్యలో లారీలు బొగ్గు రవాణా చేస్తుంటాయి. దీంతో ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుందనీ ప్రయాణీకులు చెప్తున్న పరిస్థితి. లారీల నుంచి వస్తున్న బొగ్గు డస్ట్ తో రోడ్డు మీద రెగ్యూలర్ గా వెళ్లేవాళ్లు అనేక శ్వాస సంబంధిత వ్యాధుల భారిన పడుతున్నారు.
Also read: HCU Bandh: హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్టు.. సీఎం రేవంత్ సమీక్ష
హెవీ లోడ్ తో లారీలు వేగంగా వెళ్తుండటంతో రోడ్డు గుంతల మయమై ప్రమాదాలకు నిలయంగా మారింది. పగలు, రాత్రి తేడా లేకుండా వేగంగా ప్రయాణిస్తున్న లారీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. లారీలు వేరే వాహనాలను ఢీ కొట్టటం తో పాటు లారీలు ఒకదానినొకటి ఢీ కొంటూ రోడ్డు మీద వెళ్లే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ ఐదేళ్లలో ప్రమాదాల బారిన పడి ఎన్నో ప్రాణాలు గాళ్లో కలిసిపోయాయి. బొగ్గు రవాణా చేయడానికి ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్ పనులు తొందరగా పూర్తి చేసి రోడ్డు మీద ఒత్తిడి తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్ సమస్యలపై బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు మాట్లాడుతూ అధికారులు సత్వరం చర్యలు తీసుకుని పరిసర ప్రాంత ప్రజలను కాలుష్యం బారి నుంచి కాపాడాలన్నారు. త్వరలోనే ఎన్ జీ టీ ద్రుష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్లి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా న్యాయపోరాటం చేస్తామన్నారు.